Netherlands: టీమిండియా ఆటగాళ్ల రికార్డును బ్రేక్ చేసిన నెదర్లాండ్స్ బ్యాటర్లు
ABN , Publish Date - Mar 01 , 2024 | 09:30 PM
నేపాల్ వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో నెదర్లాండ్స్ బ్యాటర్లు మైఖేల్ లెవిట్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ ప్రపంచరికార్డు నెలకొల్పారు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ బ్యాటర్లు పరుగుల వరద పారించారు.
నేపాల్ వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో నెదర్లాండ్స్ బ్యాటర్లు మైఖేల్ లెవిట్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ ప్రపంచరికార్డు నెలకొల్పారు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. నేపాల్ వేదికగా నెదర్లాండ్స్, నమీబియా, నేపాల్ జట్టు టీ20 ట్రై సిరీస్ ఆడుతున్నాయి. ఇందులో భాగంగా కీర్తిపూర్‌లోని త్రిభువన్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా నెదర్లాండ్స్, నమీబియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 5 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ మైఖేల్ లెవిట్ భారీ సెంచరీతో చెలరేగగా.. వన్‌డౌన్ బ్యాటర్ సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ భారీ హాఫ్ సెంచరీతో దుమ్ములేపారు. 11 ఫోర్లు, 10 సిక్సులతో మైఖేల్ లెవిట్ 62 బంతుల్లోనే 135 పరుగులు బాదేశాడు. 40 బంతులు ఎదుర్కొన్న సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 7 ఫోర్లు, 5 సిక్సులతో 75 పరుగులు చేశారు.
ఈ క్రమంలో వీరిద్దరు రెండో వికెట్‌కు 87 బంతుల్లోనే 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో రెండో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా వీరు చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో 2022లో నెదర్లాండ్స్‌పై రెండో వికెట్‌కు 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన భారత ఆటగాళ్లు సంజూ శాంసన్, దీపక్ హుడా రికార్డును వీరు బద్దలుకొట్టారు. అలాగే 2023లో ఇటలీపై రెండో వికెట్‌కు 183 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన బి మెక్‌ముల్లెన్, ఓ హెయిర్స్ రికార్డును కూడా వీరు అధిగమించారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే 248 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు మాత్రమే చేసింది. దీంతో నమీబియాపై నెదర్లాండ్స్ జట్టు 59 పరుగుల తేడాతో విజయం సాధించింది.