Share News

RR vs LSG: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. వరుసగా ఐదు సీజన్లలో..

ABN , Publish Date - Mar 24 , 2024 | 06:19 PM

ఐపీఎల్ 2024లో భాగంగా లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ భారీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 3 ఫోర్లు, 6 సిక్సులతో విధ్వంసం సృష్టించిన శాంసన్ 52 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

RR vs LSG: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. వరుసగా ఐదు సీజన్లలో..

జైపూర్: ఐపీఎల్ 2024లో భాగంగా లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ భారీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 3 ఫోర్లు, 6 సిక్సులతో విధ్వంసం సృష్టించిన శాంసన్ 52 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే 50+ స్కోర్ సాధించడం ద్వారా శాంసన్ చరిత్ర సృష్టించాడు. సీజన్ తొలి మ్యాచ్‌లోనే 50+ స్కోర్ సాధించడం శాంసన్‌కు ఇది మొదటిసారి ఏం కాదు. గతంలో కూడా 4 సార్లు ఈ మార్కు అందుకున్నాడు. దీంతో వరుసగా 5 సీజన్లలో తమ జట్టు ఓపెనింగ్ మ్యాచ్‌లో 50+ స్కోర్లు సాధించిన ఏకైక బ్యాటర్‌గా శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు సాధించిన మొనగాడిగా నిలిచాడు.


2020లో చెన్నైసూపర్ కింగ్స్‌పై 74, 2021లో పంజాబ్ కింగ్స్‌పై 119, 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 55, 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 55, తాజాగా లక్నోసూపర్ జెయింట్స్‌పై 82 పరుగులు చేశాడు. అలాగే ఈ మ్యాచ్‌లో సాధించిన హాఫ్ సెంచరీ ద్వారా శాంసన్ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్ల జాబితాలో జోస్ బట్లర్, అజింక్య రహానేతో కలిసి మొదటి స్థానంలో నిలిచాడు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే సంజూ శాంసన్(82) విధ్వంసానికి తోడు రియాన్ పరాగ్(43) కూడా రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ధృవ్ జురేల్ (20), యశస్వీ జైస్వాల్ (24) పర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు తీయగా.. మోహ్సీన్ ఖాన్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RR vs LSG: వాట్ ఏ క్యాచ్ రాహుల్.. గాయం తర్వాత కూడా సూపర్ కీపింగ్

IPL 2024: సన్‌రైజర్స్ vs నైట్ రైడర్స్ మ్యాచ్‌లో మైండ్ బ్లోయింగ్ టీ20 రికార్డు నమోదు



Updated Date - Mar 24 , 2024 | 06:20 PM