Share News

T20 World Cup: ‘హార్దిక్ పాండ్యా కన్నా అతడే బెటర్.. ఆ బ్యాటర్‌ని తీసుకోకపోతే తీవ్ర నిరాశే’

ABN , Publish Date - Apr 18 , 2024 | 07:58 AM

ఈమధ్య కాలంలో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో వస్తున్న విమర్శలను పక్కన పెట్టేస్తే.. అతని ప్రదర్శన కూడా ఏమంత గొప్పగా లేదు. ముఖ్యంగా.. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ అతని పెర్ఫార్మెన్స్ చాలా చెత్తగా ఉంది.

T20 World Cup: ‘హార్దిక్ పాండ్యా కన్నా అతడే బెటర్.. ఆ బ్యాటర్‌ని తీసుకోకపోతే తీవ్ర నిరాశే’
Irfan Pathan Interesting Comments On Hardik Pandya

ఈమధ్య కాలంలో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) ఏదీ కలిసి రావడం లేదు. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్సీ విషయంలో వస్తున్న విమర్శలను పక్కన పెట్టేస్తే.. అతని ప్రదర్శన కూడా ఏమంత గొప్పగా లేదు. ముఖ్యంగా.. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ అతని పెర్ఫార్మెన్స్ చాలా చెత్తగా ఉంది. బ్యాటర్‌గా, బౌలర్‌గా విఫలమవుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే.. భారత టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) జట్టులో అతనికి చోటు దక్కుతుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. అతడ్ని పక్కన పెట్టేసి, ప్రతిభావంతుడైన మరో ప్లేయర్‌ని తీసుకుంటే ఉత్తమమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇజ్రాయెల్ సైలెంట్ స్కెచ్.. ప్రతిదాడి లేకుండానే ప్రతీకారం!


తాజాగా భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం హార్దిక్ పాండ్యాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. హిట్టర్‌గా పాండ్యా సామర్థ్యం తగ్గిపోయిందని, అందుకే అతని గురించి చాలామంద మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నాడు. అతనితో పోల్చుకుంటే.. శివమ్ దూబే (Shivam Dube) మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడని, మిడిలార్డర్‌లో అతనిలాగా మరెవ్వరూ రాణించలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడున్న మిడిలార్డర్ ప్లేయర్లలో దూబేనే ఉత్తమమని కొనియాడాడు. ఎలాగైతే యువరాజ్ సింగ్ దూకుడుగా ఆడేవాడే.. అలాగే దూబే అదరగొడుతున్నాడని ప్రశంసించాడు. ఒకవేళ దూబేని టీ20 వరల్డ్‌కప్ జట్టుకి ఎంపిక చేయకపోతే.. తాను తీవ్ర నిరాశకు గురవుతానని చెప్పుకొచ్చాడు.

జపాన్ బుల్లెట్ ట్రైన్‌లో అరుదైన ఘటన.. పాము చేసిన రచ్చ కారణంగా..

పాండ్యా, దూబే ఇద్దరూ టీ20 వరల్డ్‌కప్ జట్టుకి ఎంపిక అయ్యే అవకాశం ఉందని పేర్కొన్న ఇర్ఫాన్ పఠాన్.. దూబే ఎలా రాణిస్తాడో చూడాలని ఉందని చెప్పాడు. ఐపీఎల్‌లో హార్దిక్ బౌలింగ్ చేయడం ప్రారంభించినప్పుడు.. అతనిపై దూబే ఒత్తిడి తీసుకురాగలుగుతున్నాడని చెప్పాడు. ముఖ్యంగా.. స్పిన్నర్లకు కంటి మీద కునుకు లేకుండా దూబే చేస్తున్నాడని, అతని హిట్టింగ్ సామర్థ్యాన్ని మాటల్లో వర్ణించలేమని తెలిపాడు. మరి.. ఇర్ఫాన్ పఠాన్ కోరుకుంటున్నట్టు దూబేకి టీ20 వరల్డ్‌కప్‌లో ఆడే ఛాన్స్ దక్కుతుందా? అతనికి జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది కానీ, అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 08:51 AM