Share News

U19 World Cup: 36 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో యువ భారత్ ఓపెనర్లు చెత్త రికార్డు

ABN , Publish Date - Feb 12 , 2024 | 10:51 AM

ఇటీవల కాలంలో ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియాకు ఎదురవుతున్న పరాజయాల పరంపర మరోసారి కొనసాగింది. సీనియర్ జట్టు దారిలోనే జూనియర్లు కూడా నడిచారు. దీంతో ఆదివారం జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌లో ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలైంది.

U19 World Cup: 36 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో యువ భారత్ ఓపెనర్లు చెత్త రికార్డు

ఇటీవల కాలంలో ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియాకు ఎదురవుతున్న పరాజయాల పరంపర మరోసారి కొనసాగింది. సీనియర్ జట్టు దారిలోనే జూనియర్లు కూడా నడిచారు. దీంతో ఆదివారం జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. అన్ని విభాగాల్లో విఫలమైన యువ జట్టు 79 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఫైనల్ వరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా అద్భుతంగా సాగిన భారత్ జైత్రయాత్రకు తుది పోరులో బ్రేక్ పడింది. ఫలితం ఆరోసారి అండర్ 19 వన్డే ప్రపంచకప్ గెలవాలనే భారత్ కోరిక నెరవేరలేదు. ఓటమికి తోడు ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్లు చెత్త రికార్డును నెలకొల్పారు.


ఈ ప్రపంచకప్ కప్ ఎడిషన్‌లో యువ భారత్ ఓపెనర్లు ఆదర్శ్‌ సింగ్‌, అర్షిన్‌ కులకర్ణి కలిసికట్టుగా రాణించడంలో విఫలమయ్యారు. ఓపెనర్లిద్దరు కలిసి కనీసం ఒక మ్యాచ్‌లో కూడా తొలి వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు. 36 ఏళ్ల అండర్ 19 వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో భారత ఓపెనర్లు కనీసం ఒక మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోవడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఘనత సాధించిన ఓపెనర్లుగా ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి చెత్త రికార్డు నెలకొల్పారు. ఓపెనర్ల వైఫల్యంతో ఫైనల్ మ్యాచ్‌లోనూ భారత జట్టు 3 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే ఓపెనింగ్‌లో శుభారంభాలను అందించడంలో విఫలమైనప్పటికీ, ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి వ్యక్తిగతంగా రాణించారు. టోర్నీలో ఆదర్శ్ సింగ్ రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. బంగ్లాదేశ్‌పై 76 పరుగులు చేశాడు. అర్షిన్ కులకర్ణి ఒక సెంచరీ చేశాడు. యూఎస్‌ఏ జట్టుపై 108 పరుగులతో సత్తా చాటాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 10:59 AM