Share News

IND vs ENG: 41 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ సీనియర్ పేసర్

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:59 PM

భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర స‌ృష్టించాడు. 41 ఏళ్ల వయసులోనూ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ మూడో రోజు ఆటలో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్‌ను అండర్సన్ పెవిలియన్ చేర్చాడు.

IND vs ENG: 41 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ సీనియర్ పేసర్

ధర్మశాల: భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర స‌ృష్టించాడు. 41 ఏళ్ల వయసులోనూ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ మూడో రోజు ఆటలో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్‌ను అండర్సన్ పెవిలియన్ చేర్చాడు. తద్వారా టెస్టుల్లో అండర్సన్ 700 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన మొదటి పేస్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 187 టెస్టులాడిన అండర్సన్ 26 సగటుతో 700 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా మూడో బౌలర్‌గా నిలిచాడు. అండర్సన్ కంటే ముందు స్పిన్ బౌలర్లు శ్రీలంక మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వార్నర్ కూడా టెస్టుల్లో 700 వికెట్ల మార్కును అందుకున్నారు. అత్యధికంగా మురళీధరన్ 800 వికెట్లు తీయగా.. 708 వికెట్లు తీసిన షేన్ వార్న్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో అండర్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. తన 21 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో అండర్సన్ అన్ని ఫార్మాట్లలో కలిపి 987 వికెట్లు తీశాడు. 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు. అండర్సన్ వయసు గల క్రికెటర్లంతా ఇప్పటికే రిటైర్ అయిపోయారు. కానీ అండర్సన్ మాత్రం 41 ఏళ్ల వయసులోనూ సత్తా చాటుతూ కుర్రాళ్లకు సవాల్ విసురుతున్నాడు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ధర్మశాల టెస్టులో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. భారత స్పిన్నర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బ్యాటర్లు కూడా చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 477 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 259 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉంది. ఆ జట్టు ఇంకా 146 పరుగులు వెనుకబడి ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకుంటే అదే ఎక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Viral Video: ఇలాంటి క్యాచ్ నబూతో.. నభవష్యతి.. మీరు క్రికెట్ ఫ్యాన్స్ అయితే కచ్చితంగా చూడాల్సిందే..

IND vs ENG: ఐదో టెస్టులో టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు



Updated Date - Mar 09 , 2024 | 12:59 PM