Share News

ILT20 2024: దారుణంగా ఫెయిలైన అంబటి రాయుడు.. కేవలం..

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:27 PM

ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ లీగ్ 2024ను తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఫేలవ ప్రదర్శనతో ప్రారంభించాడు. తన మొదటి మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే ఔటయ్యాడు. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ ఎమిరేట్స్ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్న రాయుడు శనివారం దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు.

ILT20 2024: దారుణంగా ఫెయిలైన అంబటి రాయుడు.. కేవలం..

ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ లీగ్ 2024ను తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఫేలవ ప్రదర్శనతో ప్రారంభించాడు. తన మొదటి మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే ఔటయ్యాడు. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ ఎమిరేట్స్ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్న రాయుడు శనివారం దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన రాయుడు 2 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేశాడు. సికిందర్ రాజా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ జట్టు కూడా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ వసీమ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యాన్ని దుబాయ్ క్యాపిటల్స్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే చేధించింది. 39 బంతుల్లోనే 81 పరుగులతో రెహ్మనుల్లా గుర్బాజ్ చెలరేగాడు. వన్ డౌన్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు.


కాగా ఐపీఎల్ 2023తో బీసీసీఐతో అంబటి రాయుడు బంధం తెంచుకున్నాడు. ఆ తర్వాత కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఆడాడు. ప్రస్తుతం ఐఎల్ టీ20 టోర్నీ 2024లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌కు ముందు రాయుడు ఏపీ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసే ప్రయత్నం చేశాడు. అధికారికంగా అధికార వైసీపీ పార్టీలో కూడా చేరాడు. దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున రాయుడు పోటీ చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే రాయుడు అందరికీ బిగ్ షాక్ ఇచ్చాడు. వైసీపీలో చేరి రోజులు కూడా గడవక ముందే పార్టీకి రాజీనామా చేశాడు. కాగా 38 ఏళ్ల అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు 2019లోనే గుడ్ బై చెప్పేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 55 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. వన్డేల్లో 47 సగటుతో 1694 పరుగులు, 6 టీ20ల్లో 42 పరుగులు చేశాడు. వన్డేల్లో 3 వికెట్లు కూడా తీశాడు.

Updated Date - Jan 21 , 2024 | 12:27 PM