Share News

IPL: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌.. హైదరాబాద్‌లో జోరుగా బెట్టింగ్..!

ABN , Publish Date - May 26 , 2024 | 11:49 AM

చెన్నై చిదంబరం స్టేడియంలో ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ సందర్భంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుండడంతో బెట్టింగ్ ఊపందుకుంది. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన బుకీలు హైదరాబాద్ చేరుకున్నారు. హోటళ్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

IPL: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌.. హైదరాబాద్‌లో జోరుగా బెట్టింగ్..!
ipl final match

ఐపీఎల్ మే 26: చెన్నై చిదంబరం స్టేడియంలో ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ సందర్భంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుండడంతో బెట్టింగ్ ఊపందుకుంది. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన బుకీలు హైదరాబాద్ చేరుకున్నారు. హోటళ్లు కేంద్రాలుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కోట్ల రూపాయల్లో నగదు చేతులు మారుతోంది. కేకేఆర్ హాట్ ఫేవరెట్‌గా ఉండడంతో వెయ్యి రూపాయలు బెట్ వేస్తే రూ.850.. అదే సన్‌రైజర్స్‌పై వెయ్యికి వెయ్యి ఇస్తున్నట్లు సమాచారం. దీంతో కేకేఆర్‌పై భారీగా బెట్టింగ్ వేస్తున్నారు. సన్‌రైజర్స్ ఈ రోజు అద్భతం చేస్తుందని.. ఆ జట్టే గెలుస్తోందని మరికొందరు ధీమా వ్యక్తం చేస్తూ బెట్ వేస్తున్నారు. హైదారాబాద్ స్టార్ హోటల్స్ కేంద్రంగా బుకీలు బెట్ నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బుకీలు హైదారాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ స్థావరాలపై పోలీసుల నిఘా కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Updated Date - May 26 , 2024 | 02:01 PM