Share News

Dinesh Karthik: దినేశ్ కార్తిక్ రిటైర్‌మెంట్ ప్రకటించాడా.. అసలు నిజం ఏంటి?

ABN , Publish Date - May 23 , 2024 | 11:46 AM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌కి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ముందు నుంచే వార్తలొస్తున్నాయి. స్వయంగా డీకేనే ఈ విషయాన్ని మొదట్లోనే చెప్పాడు. మరి..

Dinesh Karthik: దినేశ్ కార్తిక్ రిటైర్‌మెంట్ ప్రకటించాడా.. అసలు నిజం ఏంటి?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌కి (Dinesh Karthik) ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ముందు నుంచే వార్తలొస్తున్నాయి. స్వయంగా డీకేనే ఈ విషయాన్ని మొదట్లోనే చెప్పాడు. మరి.. తాను చెప్పినట్టుగానే అతను ఐపీఎల్‌కి వీడ్కోలు పలికాడా? అంటే.. అవుననే క్లారిటీ ఇచ్చేసింది ఐపీఎల్ యాజమాన్యం. నిజానికి.. దినేశ్ కార్తిక్ తన రిటైర్‌మెంట్ ఇంకా నోరు విప్పలేదు. కానీ.. రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న దృశ్యాలు ఆ విషయాన్ని ధృవీకరించాయి. ఐపీఎల్ యాజమాన్యం సైతం డీకే రిటైర్‌మెంట్‌ని ఎక్స్ వేదికగా కన్ఫమ్ చేసింది.


Read Also: విమానంలో విచిత్రం.. సీటు లేకపోవడంతో ఏం జరిగిందంటే?

16 ఏళ్ల క్రితం ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి అడుగుపెట్టిన దినేశ్ కార్తిక్.. మొత్తం ఆరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడని, మరపురాని జ్ఞాపకాల్ని మిగిల్చాడని ‘జియో సినిమా’ ఎక్స్ వేదికగా పేర్కొంది. ఐపీఎల్‌లో అత్యధిక డిస్మిసల్స్ చేసిన రెండో వికెట్‌కీపర్‌గా డీకే నిలిచాడని, ఈ లీగ్ చరిత్రలో అత్యధిక ప్రదర్శనలు కనబర్చిన మూడో ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడని వెల్లడించింది. అంతేకాదు.. దినేశ్ కార్తిక్ గుడ్ బై చెప్తున్నట్టు ఓ పోస్టర్ కూడా ఈ ట్వీట్‌కి జత చేశారు. కారు వెనకాల జస్ట్ రిటైర్డ్ అని రాసి ఉండగా.. దాని కిందే ఉన్న నంబర్ ప్లేట్‌పై డీకే 19 అని ముద్రించారు. అలాగే.. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్యాలకు డీకే టాటా చెప్తున్నట్లు ఆ పోస్టర్ డిజైన్ చేశారు.

Read Also: టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో.. ఆ వార్తల్ని ఖండించిన సజ్జనార్

మరోవైపు.. ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన తర్వాత దినేశ్ కార్తిక్ తన ఆర్సీబీ ప్లేయర్స్‌ని ఆత్మీయంగా హత్తుకున్నాడు. తన చేతికి ఉన్న గ్లౌవ్స్ తీసి.. అభిమానులకు అభివాదం చేస్తూ, మైదానమంతా తిరిగాడు. ఆ సమయంలో భావోద్వేగానికి గురైన డీకే.. తనపై కురిపించిన అభిమానానికి గాను ఫ్యాన్స్ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. ఆర్సీబీ ఆటగాళ్లు అతని వెనకాలే నడుస్తూ.. చప్పట్లు కొడుతూ అతనిలో ఉత్సాహం నింపారు. అటు.. ఫ్యాన్స్ కూడా తమకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, చప్పట్లతో మైదానం మొత్తం మార్మోగించేశారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 23 , 2024 | 11:46 AM