Share News

IPL 2024: వైజాగ్‌లో పంత్‌ బృందం సాధన

ABN , Publish Date - Mar 14 , 2024 | 08:17 AM

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకొన్న రిషభ్‌ పంత్‌.. 14 నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈనెల 22 నుంచి జరిగే ఐపీఎల్‌లో ఆడేలా పంత్‌కు బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పంత్‌ తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి విశాఖపట్నం స్టేడియంలో సన్నాహకాలు మొదలుపెట్టాడు.

IPL 2024: వైజాగ్‌లో పంత్‌ బృందం సాధన

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకొన్న రిషభ్‌ పంత్‌.. 14 నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈనెల 22 నుంచి జరిగే ఐపీఎల్‌లో ఆడేలా పంత్‌కు బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పంత్‌ తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి విశాఖపట్నం స్టేడియంలో సన్నాహకాలు మొదలుపెట్టాడు. ఈసారి ఐపీఎల్‌లో తొలి దశ షెడ్యూల్‌లో భాగంగా వైజాగ్‌ను తన హోంగ్రౌండ్‌గా ఢిల్లీ ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో మంగళవారమే వైజాగ్‌ చేరుకున్న పంత్‌.. జట్టు ఆటగాళ్లు ఇషాంత్‌ శర్మ, సుమిత్‌, కుమార్‌ కుశాగ్రతో కలిసి ఇక్కడి స్టేడియంలో బుధవారం ప్రాక్టీస్‌ చేశాడు. ఇన్నాళ్లకు ఇలా బ్యాట్‌ పడుతుండడంతో.. తాను మళ్లీ అరంగేట్రం చేస్తున్నానన్న భావన కలుగుతుందని ఈ సందర్భంగా పంత్‌ అన్నాడు. వైజాగ్‌ స్టేడియంలో ఈనెల 31న చెన్నైతో, వచ్చేనెల 3న కోల్‌కతాతో ఢిల్లీ మ్యాచ్‌లు ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2024 | 08:17 AM