Share News

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2024 నుంచి స్టార్ బ్యాటర్ ఔట్!

ABN , Publish Date - Mar 14 , 2024 | 08:27 AM

ఐపీఎల్‌ ఆరంభానికి ముందు ఢిల్లీ జట్టుకు గట్టి షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు, యువ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ వ్యక్తిగత కారణాల రీత్యా లీగ్‌ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించాడు. గతేడాది వేలంలో ఏకంగా రూ. 13.23 కోట్లు వెచ్చించి బ్రూక్‌ను సన్‌రైజర్స్‌ కొనుక్కుంది.

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2024 నుంచి స్టార్ బ్యాటర్ ఔట్!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఆరంభానికి ముందు ఢిల్లీ జట్టుకు గట్టి షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు, యువ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ వ్యక్తిగత కారణాల రీత్యా లీగ్‌ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించాడు. గతేడాది వేలంలో ఏకంగా రూ. 13.23 కోట్లు వెచ్చించి బ్రూక్‌ను సన్‌రైజర్స్‌ కొనుక్కుంది. అయితే, 11 మ్యాచుల్లో 190 పరుగులే చేయడంతో అతడిని ఈసారి సన్‌రైజర్స్‌ వదులుకొంది. దీంతో వేలంలోకి వచ్చిన బ్రూక్‌ను ఈసారి ఢిల్లీ జట్టు రూ. 4 కోట్లకు తీసుకుంది. ’తన కెరీర్‌ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించిన బామ్మ గతనెలలో చనిపోయింది. ఈ విషాదకర సమయంలో నేను కుటుంబంతో గడపడం ఎంతో ముఖ్యం. అందుకే ఐపీఎల్‌లో ఆడడం లేదు’ అని 25 ఏళ్ల బ్రూక్‌ తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2024 | 08:27 AM