Share News

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కి ప్లే-ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉందా? అందుకు ఏం చేయాలి?

ABN , Publish Date - Apr 30 , 2024 | 08:23 AM

ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి 8 మ్యాచ్‌ల్లో ప్రదర్శించిన ఆటతీరుతో పాటు ఎదుర్కొన్న ఘోర పరాజయాలు చూసి.. ఈ సీజన్ నుంచి ఆ జట్టు దాదాపు నిష్క్రమించినట్టేనని అందరూ అనుకున్నారు. ప్లే-ఆఫ్స్‌కు చేరడం కష్టమేనని..

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కి ప్లే-ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉందా? అందుకు ఏం చేయాలి?

ఐపీఎల్ 2024లో (IPL 2024) ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మొదటి 8 మ్యాచ్‌ల్లో ప్రదర్శించిన ఆటతీరుతో పాటు ఎదుర్కొన్న ఘోర పరాజయాలు చూసి.. ఈ సీజన్ నుంచి ఆ జట్టు దాదాపు నిష్క్రమించినట్టేనని అందరూ అనుకున్నారు. ప్లే-ఆఫ్స్‌కు చేరడం కష్టమేనని, ఇక తట్టాబుట్టా సర్దేయాల్సిందేనని అంతా భావించారు. కానీ.. ఆ అంచనాల్ని తిప్పికొడుతూ ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ జట్టు సంచలన విజయాలు నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్లపై అఖండ విజయాలు నమోదు చేసి.. తానింకా టాప్-4 రేసులో ఉన్నానని సత్తా చాటింది.


రాత్రి కన్న ‘కలే’ ఆమె ప్రాణాలు కాపాడింది.. అసలు ఏమైందంటే?

కానీ.. ఇంతలోనే ఢిల్లీ జట్టుకి కోల్‌కతా నైట్ రైడర్స్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు దారుణ ఓటమిని చవిచూసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులే చేసింది. అది కూడా చివర్లో కుల్దీప్ యాదవ్ (35) పోరాట పటిమ కనబర్చడంతో.. ఢిల్లీ ఆ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అయితే.. ఢిల్లీ బౌలర్లు ఆ స్కోరుని డిఫెండ్ చేయలేకపోయారు. లక్ష్య ఛేధనలో భాగంగా కేకేఆర్ బ్యాటర్లు.. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ (68) ఊచకోత కోయడంతో.. ఆ జట్టు 16.3 బంతుల్లోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి, సునాయాసంగా గెలుపొందింది.

చరిత్ర సృష్టించిన ఫిల్ సాల్ట్.. 14 ఏళ్ల రికార్డ్ బద్దలు

ఇలా కేకేఆర్ చేతిలో ఓటమి ఎదురవ్వడంతో.. ఢిల్లీకి ప్లే-ఆఫ్స్ ఆశలు కష్టతరంగా మారాయి. ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్.. కేవలం 5 విజయాలే సాధించింది. పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీ జట్టు ప్లే-ఆఫ్స్‌కి వెళ్లాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక్క మ్యాచ్ ఓడినా.. రన్-రేట్ కారణంగా టాప్-4లో చోటు దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. కాబట్టి.. మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే, 16 పాయింట్లతో ప్లే-ఆఫ్స్‌కి వెళ్లే అవకాశం ఉంటుంది. మరి.. ఈ అవకాశాన్ని ఢిల్లీ వినియోగించుకుంటుందో లేదో చూడాలి.

Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 30 , 2024 | 08:23 AM