Share News

IPL 2024: చరిత్ర సృష్టించిన ఫిల్ సాల్ట్.. 14 ఏళ్ల రికార్డ్ బద్దలు

ABN , Publish Date - Apr 30 , 2024 | 07:42 AM

కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన విధ్వంసకర బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఒక అరుదైన రికార్డ్ సాధించాడు. ఒక సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా అతడు చరిత్రపుటలకెక్కాడు.

IPL 2024: చరిత్ర సృష్టించిన ఫిల్ సాల్ట్.. 14 ఏళ్ల రికార్డ్ బద్దలు
Phil Salt Break Sourav Ganguly 14 Year Old Record

కోల్‌కతా నైట్ రైడర్స్‌కు (Kolkata Knight Riders) చెందిన విధ్వంసకర బ్యాటర్ ఫిల్ సాల్ట్ (Phil Salt) ఒక అరుదైన రికార్డ్ సాధించాడు. ఒక సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో (Eden Gardens) అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా అతడు చరిత్రపుటలకెక్కాడు. ఐపీఎల్-2024 (IPL 2024) సీజన్‌లో భాగంగా.. ఈడెన్ గార్డెన్స్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన ఫిల్ సాల్ట్.. 68.60 సగటుతో 344 పరుగులు (186.65 స్ట్రైక్ రేట్) చేశాడు. ఇందులో నాలుగు అర్థశతకాలు ఉండగా.. 89 (నాటౌట్) హయ్యస్ట్ స్కోర్‌గా ఉంది.


చెట్టు నుంచి బయటకు వచ్చిన దెయ్యం కాలి వేళ్లు.. అసలు నిజమేంటంటే..

ఇంతకుముందు కేకేఆర్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) 2010లో మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లలో 331 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉండేవాడు. 14 ఏళ్ల వరకు ఆ రికార్డ్ చెక్కుచెదరకుండా అలాగే ఉంది. అయితే.. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఫిల్ సాల్ట్ ఆ రికార్డ్‌ని పటాపంచలు చేసి, అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో గంగూలీ రికార్డ్ రెండో స్థానానికి పడిపోయింది. ఇక గంగూలీ తర్వాత ఆండ్రే రసెల్ (Andre Russell) 311 పరుగులతో (2019) మూడో స్థానంలో ఉండగా.. క్రిస్ లిన్ 303 పరుగులతో (2019) నాలుగో స్థానంలో నిలిచాడు.

రాత్రి కన్న ‘కలే’ ఆమె ప్రాణాలు కాపాడింది.. అసలు ఏమైందంటే?

ఇక సోమవారం డీసీ, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. టాపార్డర్ సహా ఇతర స్టార్ బ్యాటర్లు చేతులెత్తేయగా, చివర్లో కుల్దీప్ యాదవ్ (35) ఆడిన అద్భుత నాక్ పుణ్యమా అని ఢిల్లీ జట్టు ఆ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేధనలో భాగంగా.. కేకేఆర్ జట్టు 16.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి గెలుపొందింది. ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 68) ఊచకోత కోసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 30 , 2024 | 07:42 AM