Share News

IND vs ENG: 41 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్‌లో కింగ్ కోహ్లీకి గట్టి పోటీ ఇస్తున్న సీనియర్ పేసర్

ABN , Publish Date - Jan 24 , 2024 | 12:41 PM

క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న ఆటగాళ్లే మైదానంలో చరుకుగా కదులుతారు. బాగా ఆడగలరు. క్రికెటర్లు కూడా తమ ఫిట్‌నెస్‌పై ఎక్కువగా శ్రద్ధ పెడుతుంటారు. క్రికెట్ బోర్డులు కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించిన ఆటగాళ్లనే జట్టుకు ఎంపిక చేస్తున్నాయి.

IND vs ENG: 41 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్‌లో కింగ్ కోహ్లీకి గట్టి పోటీ ఇస్తున్న సీనియర్ పేసర్

క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న ఆటగాళ్లే మైదానంలో చరుకుగా కదులుతారు. బాగా ఆడగలరు. క్రికెటర్లు కూడా తమ ఫిట్‌నెస్‌పై ఎక్కువగా శ్రద్ధ పెడుతుంటారు. క్రికెట్ బోర్డులు కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించిన ఆటగాళ్లనే జట్టుకు ఎంపిక చేస్తున్నాయి. అందుకోసం ఫిట్‌నెస్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత ఆటగాళ్లకు బీసీసీఐ యోయో టెస్టును తీసుకొచ్చింది. అంతేకాకుండా ఆటగాళ్లు పూర్తి ఫిట్‌‌నెస్ సాధించేందుకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో మనవాళ్లకు శిక్షణ కూడా ఇస్తోంది. ఇక టీమిండియాలో ఫిట్‌నెస్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ గురించి ఎంత చెప్పినా తక్కేవే అవుతుంది. తన బాడీని కోహ్లీ ఎప్పుడూ ఫిట్‌‌గా ఉంచుకుంటాడు. అందుకు కోసం చాలానే కష్టపడతాడు. టీమిండియాలోని ఆటగాళ్లంతా ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీని ఆదర్శంగా తీసుకుని కష్టపడుతుంటారు.


ఇప్పుడు కింగ్ కోహ్లీకి పోటీగా ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా వచ్చేశాడు. అండర్సన్ వయసు ప్రస్తుతం 41 ఏళ్లు. ఈ వయసు గల క్రికెటర్లంతా ఇప్పటికే ఆటకు వీడ్కోలు పలికి ఇంట్లో కూర్చుకున్నారు. కానీ అండర్సన్ మాత్రం ఇంకా ఆడుతునే ఉన్నాడు. కుర్రాడిలా మైదానంలో చురుకుగా కదులుతున్నాడు. ఇప్పటికీ అండర్సన్ పేస్‌లో ఏ మాత్రం పదును తగ్గలేదు. దీనికి కారణం ఈ వయసులోనూ అండర్సన్ మంచి ఫిట్‌నెస్ మెయింటేన్ చేయడం. 41 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్ లెవల్స్‌ను అద్భుతంగా మెయింటేన్ చేస్తున్న అండర్సన్.. విరాట్ కోహ్లీ వంటి వాళ్లకు సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. టోన్డ్ బాడీ స్ట్రక్చర్‌తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న అండర్సన్ గురువారం నుంచి హైదరాబాద్ వేదికగా జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే అండర్సన్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అండర్సన్ ఫిట్‌నెస్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 41 ఏళ్ల వయసులోనూ ఏ ఫిట్‌నెస్ గురూ.. అంటూ కొనియాడుతున్నారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు పాకిస్థాన్ ఆటగాళ్లను విమర్శిస్తున్నారు. పాకిస్థాన్ జట్టులోని చాలా మందికి అండర్సన్ వయసులో సగం మాత్రమే ఉంటుందని, కానీ బరువు మాత్రం అండర్సన్‌కు డబుల్ ఉంటుందని ఎగతాళి చేస్తున్నారు. కాగా తన 20 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో జేమ్స్ అండర్సన్ 183 టెస్ట్ మ్యాచ్‌లాడి 690 వికెట్లు తీశాడు. 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు.

Updated Date - Jan 24 , 2024 | 12:47 PM