Share News

Viral Video: మ్యాచ్ మధ్యలో పరిగెత్తుకెళ్లి ధోని కాళ్లపై పడిన వీరాభిమాని

ABN , Publish Date - May 11 , 2024 | 11:59 AM

ఐపీఎల్(IPL) మ్యాచుల సందర్భంగా ప్రతిసారి ఏదో ఒక సంఘటన చోటుచేసుకోవడం, వీడియోలు వైరల్ అయిన అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నిన్న గుజరాత్ టైటాన్స్(GT), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య జరిగిన 59వ మ్యాచ్‌లో కూడా ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచులో భాగంగా చెన్నై తరుఫున ధోని(MS Dhoni) బ్యాటింగ్ చేస్తుండగానే ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వేగంగా మైదానంలోకి ప్రవేశించాడు.

Viral Video: మ్యాచ్ మధ్యలో పరిగెత్తుకెళ్లి ధోని కాళ్లపై పడిన వీరాభిమాని
fan ran middle the match fell on Dhoni feet

ఐపీఎల్(IPL) మ్యాచుల సందర్భంగా ప్రతిసారి ఏదో ఒక సంఘటన చోటుచేసుకోవడం, వీడియోలు వైరల్ అయిన అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నిన్న గుజరాత్ టైటాన్స్(GT), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య జరిగిన 59వ మ్యాచ్‌లో కూడా ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచులో భాగంగా చెన్నై తరుఫున ధోని(MS Dhoni) బ్యాటింగ్ చేస్తుండగానే ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వేగంగా మైదానంలోకి ప్రవేశించాడు. ఆ క్రమంలో ఎంఎస్ ధోనీ వద్దకు అభిమాని చేరుకుని ధోనీ పాదాలపై పడగా, ఆ తర్వాత ధోని అతన్ని తీసుకుని హత్తుకున్నాడు.


మ్యాచ్ చివరి ఓవర్ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకోగా..అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతోంది. వీడియోలో అభిమాని పరిగెత్తుకుంటూ వచ్చిన తీరు చూసిన ధోనీ ఒక్క క్షణం షాక్ అయ్యాడు. ధోనీని అభిమాని కలిసిన క్రమంలో మాట్లాడటం కనిపించింది. ఆ క్రమంలో గమనించి అప్రమత్తమైన సిబ్బంది సహా అక్కడి పోలీసులు(police) అభిమానిని అక్కడి నుంచి లాక్కుని వెనక్కి తీసుకెళ్లారు.


మరోవైపు ఈ మ్యాచ్‌లో చెన్నైకి(CSK) ఓటమి తప్పలేదు. కానీ ఎంఎస్ ధోని బ్యాటింగ్ అభిమానులను ఆనందపరిచింది. చివరకు ఆతిథ్య గుజరాత్ జట్టు 35 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్‌ ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్లేఆఫ్‌ల విషయం ఇప్పుడు మరింత క్లిష్టంగా మారింది. తొలి మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన జట్లకు ఎదురుదెబ్బ తగిలింది.

మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు, ఇప్పుడు గుజరాత్ టైటాన్స్(GT) విజయం సాధించడం ద్వారా ప్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టతరం అయ్యాయి. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఈ రేసు నుంచి ఇప్పటికే పూర్తిగా దూరమయ్యాయి. ఇది కాకుండా మిగతా అన్ని జట్లూ కూడా ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి అర్హత కలిగి ఉన్నాయి.


ఇది కూడా చదవండి:

IPL GT VS CSK : టైటాన్స్‌ రేసులోనే

వహ్‌వా..నిషా


Read Latest Sports News and Telugu News

Updated Date - May 11 , 2024 | 12:02 PM