Share News

Lungi: లండన్ వీధుల్లో లుంగీలో యువతి హల్‌చల్.. వైరల్ వీడియో

ABN , Publish Date - May 26 , 2024 | 10:05 PM

దక్షిణాది పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే అనేక అంశాల్లో లుంగీ కూడా ఒకటి. అయితే, ఓ యువతి లుంగీ కట్టుకుని హల్‌చల్ చేసింది. లండన్ వీధుల్లో లుంగీపై ఆమె చేసిన క్యాట్ వాక్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Lungi: లండన్ వీధుల్లో లుంగీలో యువతి హల్‌చల్.. వైరల్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాది పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే అనేక అంశాల్లో లుంగీ కూడా ఒకటి. అయితే, ఓ యువతి లుంగీ కట్టుకుని ఏకంగా లండన్ వీధుల్లో క్యాట్ వాక్ చేసిన వైనం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. @valerydaania అనే ఇన్‌‌స్టా అకౌంట్‌లో ఈ వీడియో (Viral)) పోస్ట్ చేశారు.

వీడియోలోని వివరాల ప్రకారం, దక్షినాది మూలాలున్న యువతి చాలా కాలంగా లండన్‌లో ఉంటోంది. అయితే, ఈసారి ఆమె తన వారసత్వ మూలాలను లండన్ వీధుల్లో సగర్వంగా ప్రదర్శించింది.

లుంగీకి జతగా ఓ టీషర్టు ధరించిన ఆమె ట్రెండీగా ఉండేందుకు కళ్లద్దాలు కూడా పెట్టుకుని లండన్ వీధుల్లో నడుచుకుంటూ వెళితే స్థానికులు నోరెళ్లబెట్టారు. లుంగీలోనే ఆమె ఓ షాపులోకి కూడా వెళ్లింది. అక్కడి వ్యక్తి ఆమెను చూసి షాకైపోయారు. కొందరు కుతూహలం ఆపుకోలేక ఆమె పలకరించారు కూడా (Womans lungi walk in the streets of London has over 1 million views).

Silence: లైఫ్‌లో ఈ సందర్భాలు ఎదురైతే నోరు తెరవొద్దు.. మౌనమే శ్రీరామ రక్ష!


ఇక వీడియో చూసి జనాలు.. ముఖ్యంగా భారతీయులు ఆశ్చర్యపోతున్నారు. ఓ రేంజ్‌లో వీడియోను వైరల్ చేశారు. ఇప్పటివరకూ వీడియోకు ఏకంగా 11 లక్షల వ్యూస్ వచ్చాయి. కొందరు ఆమె ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. కంటెంట్ క్రియేటర్ కొత్తగా ఆలోచించిందని కామెంట్ చేశారు. లుంగీ కూడా ఆమెకు నప్పిందని మరికొందరు అన్నారు.

కాగా, ఇటీవల ఓ భారతీయురాలు జపాన్ లో చీర కట్టుకుని హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. భారత సంప్రదాయ దస్తులు చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. మరికొందరు ఆమెను పలకరించి చీర గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియోకు కూడా జనాలు బ్రహ్మరథం పట్టడంతో తెగ వైరల్ అయ్యింది. భారతీయతను సగర్వంగా ప్రదర్శించిన ఆమెపై ప్రశంసలు కురిశాయి.

Read Viral and Telugu News

Updated Date - May 26 , 2024 | 10:25 PM