Share News

Viral Video: ఆటో డ్రైవర్‌పై మహిళకు అనుమానం.. వెనుక నుంచి చూడగా.. అతడు చేస్తున్న నిర్వాకం.. చివరకు..

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:22 PM

కొందరు బస్సు, కారు, ఆటో డ్రైవర్ల వాహనం నడిపే సందర్భాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తూ ఉంటాం. బస్సు తోలుతూ హుక్కా తాగే వారు కొందరైతే.. మరికొందరు లారీ నడుపుతూనే మరోవైపు స్నానం కూడా చేసేస్తుంటారు. ఇంకొందరు వాహనం నడుపుతూనే అసభ్యకర పనులు కూడా చేసేస్తుంటారు. ఇలాంటి..

Viral Video: ఆటో డ్రైవర్‌పై మహిళకు అనుమానం.. వెనుక నుంచి చూడగా.. అతడు చేస్తున్న నిర్వాకం.. చివరకు..

కొందరు బస్సు, కారు, ఆటో డ్రైవర్ల వాహనం నడిపే సందర్భాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తూ ఉంటాం. బస్సు తోలుతూ హుక్కా తాగే వారు కొందరైతే.. మరికొందరు లారీ నడుపుతూనే మరోవైపు స్నానం కూడా చేసేస్తుంటారు. ఇంకొందరు వాహనం నడుపుతూనే అసభ్యకర పనులు కూడా చేసేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆటోలో వెళ్తున్న మహిళకు.. ఉన్నట్టుండి డ్రైవర్‌పై అనుమానం కలిగింది. వెనుక నుంచి చాటుగా చూసి.. చివరకు ఏం చేసిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముంబైలో (Mumbai) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు (woman) ఆటోలో వెళ్తుండగా.. మార్గమధ్యలో డ్రైవర్‍‌పై అనుమానం కలిగింది. ఏం చేస్తున్నాడబ్బా.. అని సందేహం వచ్చి, వెనుక నుంచి ముందు వైపు చూసింది. సదరు డ్రైవర్ (Auto driver) ఓ వైపు డ్రైవింగ్ చేస్తూనే మరో వైపు ఫోన్‌లో వీడియోలు చూసుకుంటున్నాడు. పదే పదే కోడ్డు వైపు, ఫోన్ వైపు చూస్తుండడం చూసి ఆమె షాక్ అయింది. ఎక్కడ ఏ వాహనాన్ని ఢీకొడతాడో అని కంగారుపడింది.

Viral Video: ఎండ వేడి భరించలేక.. లారీ నడుపుతూనే ఈ డ్రైవర్ చేసిన నిర్వాకం చూస్తే..

ఆటో డ్రైవర్ మాత్రం తాపీగా వీడియోలు చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నాడు. డ్రైవర్ చేసిన పనికి ఆమెకు చిర్రెత్తుకొచ్చి.. వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఆ వీడియోను ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేసింది. ఈ వీడియోపై ముంబై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. లోకేషన్ తదితర సమాచారం అందిస్తే.. వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలావుండగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి డ్రైవర్లను కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వామ్మో..! ఈ కింగ్ కోబ్రా ఎంత పని చేసిందీ.. దాని నోటి నుంచి ఏం బయటికి వచ్చిందో చూస్తే..

Updated Date - Apr 25 , 2024 | 05:22 PM