Share News

Trekking: ట్రెక్కింగ్ చేసేందుకు దేశంలోని టాప్ 5 స్టేషన్స్ ఇవే.. మీరూ ఓ లుక్కేయండి..

ABN , Publish Date - Feb 05 , 2024 | 10:53 AM

ప్రకృతి అందాలను తిలకించేందుకు ఇదే సరైన సమయం. ట్రెక్‌కు వెళ్లేందుకూ మంచి తరుణం. అందమైన ప్రకృతి దృశ్యాలు, సుందరమైన పర్వతాలు, కఠినమైన ట్రెక్కింగ్ ట్రయల్స్ అనుభవాన్ని మరింత ఉత్కంఠగా మారుస్తాయి.

Trekking: ట్రెక్కింగ్ చేసేందుకు దేశంలోని టాప్ 5 స్టేషన్స్ ఇవే.. మీరూ ఓ లుక్కేయండి..

ప్రకృతి అందాలను తిలకించేందుకు ఇదే సరైన సమయం. ట్రెక్‌కు వెళ్లేందుకూ మంచి తరుణం. అందమైన ప్రకృతి దృశ్యాలు, సుందరమైన పర్వతాలు, కఠినమైన ట్రెక్కింగ్ ట్రయల్స్ అనుభవాన్ని మరింత ఉత్కంఠగా మారుస్తాయి. మీరు పర్వతాలు ఎక్కడానికి ఇష్టపడే వారైతే, ప్రకృతి అద్భుతాలను వీక్షించాలనకునే వారికి ట్రెక్కింగ్ అనేది మంచి అనుభూతి, అనుభవాన్ని ఇస్తుంది. ట్రెక్ ప్రేమికులు తమ జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా సందర్శించాల్సిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కేదార్‌నాథ్ ట్రెక్, ఉత్తరాఖండ్.. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ట్రెక్‌లలో కేదార్‌నాథ్ ట్రెక్ ఒకటి. వేలాది మంది యాత్రికులు తమ ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం ఈ కష్టమైన ట్రెక్‌ను ఎంచుకుంటారు. 3,810 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ట్రెక్కింగ్ దాదాపు 20 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ట్రెక్కింగ్‌ను మరింత సాహసోపేతమైనది చేయడంతో పాటు శివుని అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో ఒకటిగా కేదార్‌నాథ్ ఆలయం ప్రసిద్ధి గాంచింది.


హర్ కి డన్ ట్రెక్, ఉత్తరాఖండ్.. ఉత్తరాఖండ్‌లోని గోవింద్ వల్లభ్ పంత్ నేషనల్ పార్క్ లో 3,566 మీటర్ల ఎత్తులో ఉన్న హర్ కీ డన్ పర్యాటక ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందింది. ఏటా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అద్భుతమైన పురాతన సంస్కృతి, పర్వతాలు, గడ్డి భూములు, అడవులు, నదులు, పచ్చిక భూములు, ప్రవాహాలు, ఆల్పైన్ సరస్సును చూడటానికి రెండు కళ్లూ చాలవు అనడంలో అతిశయోక్తి కాదు.

కువారీ పాస్ ట్రెక్, ఉత్తరాఖండ్.. క్యూరీ పాస్ ట్రెక్ పర్వాతోరహణకు మంచి సెలక్షన్. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న పిపాల్‌కోటి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఈ పర్వతం పైకి ఎక్కితే ఎత్తైన పర్వతం అయిన మౌంట్ నందా దేవిని చూసేందుకూ అవకాశం కలుగుతుంది.


చాదర్ ట్రెక్, లడఖ్.. చాదర్ ట్రెక్ అనేది ప్రతి యాత్రికుడు వారి జీవితంలో తప్పక చూడవలసిన ట్రెక్కింగ్ ప్రదేశం. సముద్ర మట్టానికి 11,150 అడుగుల ఎత్తులో ఉన్న చాదర్ ట్రెక్ హిమాలయాల్లో మరే ఇతర ట్రెక్ లాంటిది కాదు. అత్యంత అద్భుతమైన ఉల్లాసకరమైన శీతాకాలపు ట్రెక్‌లలో ఇదీ ఒకటి. చాదర్ ట్రెక్ లడఖ్‌లో ఉంది.

చోప్తా చంద్రశిలా ట్రెక్, ఉత్తరాఖండ్.. సాహసోపేత ట్రెక్, థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం చూసే వారికి చోప్తా చంద్రశిలా ట్రెక్ సరైనది. మంచుతో నిండిన ఎత్తైన ప్రాంతాలను, హిమాలయ పర్వతాల అందమైన రూపాన్ని, మనోహరమైన దృశ్యాలను అందిస్తుంది. రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న ఇది.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 05 , 2024 | 10:53 AM