Share News

Viral Video: బైక్ మీద రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన జంట.. వీడియో లీకవడంతో ఏం జరిగిందంటే..!

ABN , Publish Date - May 25 , 2024 | 12:26 PM

ఈ మధ్యకాలంలో యువ జంటలు బైకుల మీద చేస్తున్న నిర్వాకాలు చాలా వైరల్ గా మారుతున్నాయి. నాలుగ్గోడల మధ్య జరగాల్సిన పనులు పబ్లిక్ గా చేస్తూ సోషల్ మీడియా దృష్టిలో పడుతున్నారు.

Viral Video: బైక్ మీద రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన జంట.. వీడియో లీకవడంతో ఏం జరిగిందంటే..!

యువతకు బైకులంటే పిచ్చి. రహదారుల మీద బైకులో వెళ్తూ స్టంట్లు చేస్తుంటారు కొందరు. ఇలాంటి సందర్బాలలో చాలామంది గాయపడతారు కూడా. అయితే ఈ మధ్యకాలంలో యువ జంటలు బైకుల మీద చేస్తున్న నిర్వాకాలు చాలా వైరల్ గా మారుతున్నాయి. నాలుగ్గోడల మధ్య జరగాల్సిన పనులు పబ్లిక్ గా చేస్తూ సోషల్ మీడియా దృష్టిలో పడుతున్నారు. రాజస్థాన్ రాష్ట్రం కోటలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

వీటిని తింటే చాలు.. మెదడు వేగంగా కంప్యూటర్ లా పనిచేస్తుంది..!


రాజస్థాన్ రాష్ట్రం కోట లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక యువ జంట బైక్ మీద వెళ్తూ కనిపిస్తుంది. బైక్ మీద అమ్మాయి బైక్ ట్యాంక్ పై యువకుడికి ఎదురుగా కూర్చుని ఉంది. అతను బైక్ డ్రైవ్ చేస్తుంటే ఆమె అతన్ని కౌగిలించుకుంటూ, ముద్దులు పెడుతోంది. వీరికి వెనుక బైక్ మీద వస్తున్న వ్యక్తులు ఈ సంఘటనను కెమెరాలో బంధించారు. కోట లోని హెర్భల్ పార్క్ ముందు ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది.

ఖాళీ కడుపుతో పొరపాటున కూడా తినకూడని ఆహారాలు ఇవి..!


MANOJ SHARMA LUCKNOW UP అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారు. యువతీయువకుడిని అరెస్ట్ చేశారు. చెవులు పట్టుకుని మరీ వారి చేత క్షమాపణ చెప్పించారు. ఈ వీడియో విషయంలో నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.

ఖాళీ కడుపుతో పొరపాటున కూడా తినకూడని ఆహారాలు ఇవి..!

వీటిని తింటే చాలు.. మెదడు వేగంగా కంప్యూటర్ లా పనిచేస్తుంది..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం... ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 25 , 2024 | 12:26 PM