ఖాళీ కడుపుతో పొరపాటున కూడా తినకూడని ఆహారాలు ఇవి..!

నారింజ, ద్రాక్ష, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లు ఆమ్లత కలిగి ఉంటాయి.  వీటిని ఖాళీ కడుపుతో తినకూడదు.

స్పైసీ ఫుడ్స్ కడుపు లైనింగ్ ను చికాకు పెడతాయి. అజీర్ణానికి కారణం అవుతాయి.  ఖాళీ కడుపుతో వీటిని తినకూడదు.

కార్పోనేటెడ్ పానీయాలలో సోడా, చక్కెర శాతం ఎక్కువ ఉంటాయి. ఖాళీ కడుపుతో తీసుకుంటే  కడుపు ఉబ్బరం, గ్యాస్ కలిగిస్తాయి.

కాఫీ, బ్లాక్ కాఫీ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది.  ఇది ఖాళీ కడుపుతో తీసుకుంటే గుండెలో మంట, అజీర్ణానికి దారితీస్తుంది.

టమోటాలు సిట్రస్ పండ్ల మాదిరిగానే ఆమ్లం కలిగి ఉంటాయి. ఖాళీ కడుపుతో తింటే గుండెల్లో మంట, అజీర్ణం ఏర్పడుతుంది.

వేయించిన ఆహారాలలో కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. జీర్ణవ్యవస్థ పై ఒత్తిడి పెంచుతుంది.

చక్కెర కలిగిన తృణధాన్యాలు, పేస్ట్రీలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఖాళీ కడుపుతో తిన్నప్పుడు రక్తంలో చక్కెరలు స్పైక్ అయ్యే అవకాశం ఉంటుంది.

పాలు, పాలు ఉత్పత్తులు, పెరుగు వంటివి ఖాళీ కడుపుతో  తీసుకుంటే జీర్ణం కావడం కష్టం. లాక్టోస్  అసహనం ఉన్నవారికి ఇది మంచిది కాదు.