Share News

Viral Video: అబ్బబ్బ.. ఈ టాలెంట్ మామూలుగా లేదుగా.. టిఫిన్ సెంటర్‌లో ఇతడేం చేస్తున్నాడో చూస్తే..

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:49 PM

రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్‌ పెట్టుకున్న కొందరు పరాఠాలు చేస్తున్న తీరు జనాలను ఆశ్చర్యపరుస్తోంది.

Viral Video: అబ్బబ్బ.. ఈ టాలెంట్ మామూలుగా లేదుగా.. టిఫిన్ సెంటర్‌లో ఇతడేం చేస్తున్నాడో చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: తక్కువ ధర.. రుచికరమైన ఆహారం కావాలంటే స్ట్రీట్ ఫుడ్‌కు మించినది లేదు. ప్రపంచవ్యాప్తంగా భోజనప్రియులందరూ స్ట్రీట్ ఫుడ్ (Street food) చెప్తే నోరూరుతుందంటారు. ఇది చాలదన్నట్టు ఇలాంటి చోట్ల వంటవాళ్లు నేర్పుగా ఆహారం వండే విధానం కూడా చూసేవాళ్లను అబ్బురపరుస్తుంది. వంట చేయడమంటే ఓ కళ అన్న రీతిలో వాళ్లు తమ పనిలో నిమగ్నమైపోతూ ఫుడ్‌తో రకరకాల ఫీట్స్ చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు తరచూ వైరల్ (Viral) అవుతున్నా వేటికవే ప్రత్యేకం. అందుకే ప్రస్తుతం మరో వీడియో ట్రెండింగ్‌లో ఉంది.

Viral: ఏ దేవుడో కాపాడాడుగానీ.. లేకపోతేనా.. ఉతికిన దుస్తుల కోసం మహిళ కప్‌బోర్డు తెరిస్తే..


ఈ వీడియోలోని వ్యక్తి పరాఠాలు చేస్తున్న తీరుకు జనాలు నోరెళ్లబెడుతున్నారు. అటు రుచికరమైన ఫుడ్, ఇటు ఎంటర్‌టైన్మెంట్ ఒకేసారి దొరుకుతోందని అంటున్నారు. ఓ వ్యక్తి పరాఠాలు కాల్చుతుంటే మరో వ్యక్తి వాటిని తనదైన స్టైల్‌లో ఒత్తి మూకుడు మీదకు విసురుతున్నాడు. వాస్తవానికి అతడు పరాఠాలు కాల్చుతున్న ప్రదేశానికి చాలా దూరంలోనే ఉన్నాడు. అయినా కూడా అతడి గురి మాత్రం తప్పలేదు. అతడు ఒక్కో పరాఠాను ఒత్తి ఆపై దాన్ని కొన్ని అడుగుల దూరంలో ఉన్న పెనంపై పడేలా అలవోకగా విసురుతున్నాడు (Chapathi making video). అక్కడ పరాఠాలను కాలుస్తున్న మరో వ్యక్తి పెనంపై పడుతున్న పరాఠాలను జాగ్రత్తగా ఒడిసిపడుతూ క్షణాల్లో వాటిని రెడీ చేసి కస్టమర్లకు ఇస్తున్నాడు. ఆ ఇద్దరి పనితీరు సరిగ్గా సెట్ కావడంతో కస్టమర్లకు ఏమాత్రం ఆలస్యం లేకుండా ఫుడ్ సిద్ధం అవుతోంది.

Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..


ఇక నెట్టింట కూడా ఈ వీడియో వైరల్ అవుతూ జనాలను ఆశ్చర్యపరుస్తోంది. ఏం టాలెంటురా బాబూ అంటూ నెటిజన్లు కామెంట్‌ల వరద పారిస్తున్నారు. పరాఠాలు ఇలా చేస్తే నోరూరకుండా ఉంటాయా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వీడియోలు మరి కొన్నింటిని కూడా నెటిజన్లు పంచుకున్నారు. స్ట్రీట్ ఫుడ్‌కు సాటిరాగలదని మరొకటి లేదంటూ ముక్తకంఠంతో జైకొట్టారు. మరి ఈ వీడియోను మీరూ ఓ మారు చూడండి.

Viral: తప్పు చేసి భారీ మూల్యం చెల్లించిన బబూన్ కోతి! సింహం ఏ రేంజ్‌లో రివెంజ్ తీర్చుకుందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 04:55 PM