Share News

Viral: తప్పు చేసి భారీ మూల్యం చెల్లించిన బబూన్ కోతి! సింహం ఏ రేంజ్‌లో రివెంజ్ తీర్చుకుందో చూస్తే..

ABN , Publish Date - Mar 12 , 2024 | 08:50 PM

సింహం పిల్లను ఎత్తుకెళ్లిన ఓ కోతి చివరకు భారీ మూల్యం చెల్లించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: తప్పు చేసి భారీ మూల్యం చెల్లించిన బబూన్ కోతి! సింహం ఏ రేంజ్‌లో రివెంజ్ తీర్చుకుందో చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: సింహంతో ప్రతిజీవికీ శత్రుత్వమే. వాటిని చంపే అవకాశం వస్తే ఇతర జీవాలు వదిలిపెట్టవు. పెద్దవాటిని చంపడం సాధ్యం కాదు కాబట్టి చిన్న సింహాలను టార్గెట్ చేస్తుంటాయి. ఇలా చేసే జంతువుల్లో హైనాలు, బబూన్ కోతులు ముందుంటాయి. తాజాగా ఓ బబూన్ కోతి సరిగ్గా ఇలాగే చేసింది. సింహం పిల్ల ఒంటరిగా ఉండటం గమనించి దాన్ని ఎత్తుకెళ్లే సాహసం చేసింది. చివరకు భారీ మూల్యం చెల్లించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా (Viral Video) మారింది.

Viral: 50 ఏళ్లుగా కోకోకోలా తప్ప చుక్క నీరు కూడా తాగలేదు.. చివరకు ఇతడి పరిస్థితి ఏమైందో తెలిస్తే..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ సింహం తన పిల్లల్ని పొదలమాటున దాచి వేటకు వెళ్లింది. ఇదే అవకాశంగా భావించిన ఓ బబూన్ కోతి పిల్ల సింహాన్ని ఎత్తుకెళ్లిపోయింది. ఆ తరువాత దానికి నరకం చూపించింది. కొరుకుతూ రక్కుతూ నానా హింస పెట్టింది. కొంత సేపటికి పిల్ల సింహం అచేతనంగా మారిపోయింది. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. ఈలోపు అక్కడకు వచ్చిన తల్లి సింహం తన సంతానాన్ని రక్షించుకునేందుకు దాని వెంట పడింది. అయితే, బబూన్ కోతి సింహం పిల్లతో సహా చెట్టెక్కి చిటారు కొమ్మకు చేరుకుంది. సింహం కూడా దాని వెంట చెట్టుచివరి వరకూ వెళ్లింది (Lioness attacks baboon for stealing its cub).

Viral: పెళ్లిలో వరుడి కంట కన్నీరు.. డాక్టర్ వధువుకు అతడిపై డౌటొచ్చి..


ఈ క్రమంలో తీవ్ర టెన్షన్ పడ్డ బబూన్ కోతి వెంటనే కిందకు దూకేసింది. దాన్ని వెంబడించిన తల్లి సింహం దాన్ని చిత్ర హింసలకు గురించి చేసింది. తనని తాను రక్షించుకునేందుకు కోతి కొంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. అయితే, తరువాత ఏం జరిగిందనేది వీడియోలో లేకపోయినప్పటికీ సింహం దాన్ని చంపేసే ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు. తన పిల్లను ఎత్తికెళ్లినందుకు సింహం బబూన్ కోతిపై రివెంజ్ తీర్చుకుందని చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 08:57 PM