Share News

Viral: ఏ దేవుడో కాపాడాడుగానీ.. లేకపోతేనా.. ఉతికిన దుస్తుల కోసం మహిళ కప్‌బోర్డు తెరిస్తే..

ABN , Publish Date - Mar 16 , 2024 | 03:31 PM

కప్‌బోర్డులో దూరిన పామును చూసి మహిళకు షాక్. నెట్టింట వీడియో వైరల్

Viral: ఏ దేవుడో కాపాడాడుగానీ.. లేకపోతేనా.. ఉతికిన దుస్తుల కోసం మహిళ కప్‌బోర్డు తెరిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళకు ప్రాణాపాయం తృటిలో తప్పిపోయింది. ప్రమాదం తప్పినా మనసులో భయం వదలకపోవడంతో ఆమె తన పరిస్థితిని నెట్టింట పంచుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్‌గా (Viral Video) మారింది. ఆస్ట్రేలియాలోని (Australia) క్వీన్స్‌ల్యాండ్‌లో ఈ ఘటన జరిగింది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం సదరు మహిళ కప్‌బోర్డులోని దుస్తులు తీసుకోబోతుండగా ఓ పాము తలబయటపెట్టి కనిపించింది. అది మామూలు పాము కాదు. ప్రపంచంలోనే రెండో అత్యంత విషపూరిత పాము. అయితే, మహిళ వెంటనే అప్రమత్తమై పాముల సంరక్షకులకు సమాచారం అందించింది. దీంతో, వారు దాన్ని జాగ్రత్తగా బయటకు తీసి అడవిలో విడిచిపెట్టారు (Snake Found Hiding in Cupboard).

Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..


పాము సమస్య తొలగిపోవడంతో మహిళ ఊపిరిపీల్చుకుంది. భారీ ప్రమాదం తప్పించిన పాముల సంరక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ‘‘అది అప్పటికే తల బయటపెట్టింది కాబట్టి సరిపోయింది. లేకపోతే అది అక్కడ ఉన్నట్టు నాకు తెలిసేదే కాదు. ఆ తరువాత కప్‌బోర్డులో తెలియక చేయి పెట్టి పాము కాటు బారిన పడి ఉండేదాన్ని. ఈ పాము కాటు నుంచి తప్పించుకోవడం అసాధ్యం’’ అని ఆమె చెప్పుకొచ్చింది.

వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఏ దేవుడో కాపాడాడు కానీ లేకపోతే ఆమె పాము కాటు బారిన పడి మరణించేదని చెప్పారు. ఆస్ట్రేలియాలో ఇలాంటి పాములు జీవితంలో ఎప్పుడోకప్పుడు తారసపడటం సహజమని కొందరు అన్నారు. ఆహారం వెతికే క్రమంలో పాములు ఒక్కోసారి ఇలా మనుషుల నివాసాల్లోకి కూడా వచ్చేస్తాయని తెలిపారు.

Viral: తప్పు చేసి భారీ మూల్యం చెల్లించిన బబూన్ కోతి! సింహం ఏ రేంజ్‌లో రివెంజ్ తీర్చుకుందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 03:39 PM