Share News

Viral Video: రహదారి మీద ఇలా టీమిండియా స్టార్ ఆటగాడు.. ఇతడు ఎవరో తెలిసి అవాక్కవుతున్న నెటిజన్లు..!

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:10 PM

సినీతారలు, క్రికెట్ స్టార్ లు, సెలబ్రిటీలు అప్పుడప్పుడు సాధారణ వ్యక్తుల్లా రహదారుల మీద కనబడి అందరినీ ఆశ్చర్యపరుస్తంటారు. ఇప్పుడూ ఓ స్టార్ క్రికెటర్ వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: రహదారి మీద ఇలా టీమిండియా స్టార్ ఆటగాడు.. ఇతడు ఎవరో తెలిసి అవాక్కవుతున్న నెటిజన్లు..!

టీం ఇండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటాడు. బౌలింగ్ లో దుమ్ము రేపే షమీ తన ప్రతిభకు తాజాగా రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు కూడా అందుకున్నాడు. అలాంటి షమీ కామన్ మ్యాన్ లాగా రహదారి మీద కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని వెనుక అసలు నిజం తెలిశాక నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..

అర్జున అవార్డు గ్రహీత మహమ్మద్ షమీ(Arjuna Awardee Mohammad Shami) భారత్ టాప్ బౌలర్స్ లో ఒకరిగా ఉన్నారు. ఈయన ఎప్పడూ ఏదో ఒక కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా కామన్ మ్యాన్ లాగా రహదారి మీద కనిపించిన వీడియో అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. వీడియోలో మహమ్మద్ షమీ బూడిద రంగు జాకెట్, మంకీ క్యాప్ ధరించి చలి వాతావరణంలో రహదారి మీద కనిపిస్తాడు. ఇతన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కానీ నిజానికి ఇతను మహమ్మద్ షమీ కాదని తెలిసి అవాక్కవుతున్నారు. అచ్చం షమీ పోలికలతోనే కొంచెం కూడా తేడా లేకుండా ఉండటం అయోమయానికి గురిచేస్తుంది. మహమ్మద్ షమీలాగా కనిపిస్తున్న వ్యక్తి మహారాష్ట్ర(Maharashtra) రాష్ట్రం నాగ్ పూర్ కు చెందిన వాడు. ఇతన్ని వీడియో తీస్తున్న వ్యక్తి ఒకసారి షమీ లాగా బౌలింగ్ యాక్షన్ చేయగలవా అని అడుగుతాడు. ఆ వెంటనే షమీని పోలిన వ్యక్తి బౌలింగ్ చేస్తాడు. ఇది చూస్తే అతను నిజంగా షమీనేమో అనిపిస్తుంది. బౌలింగ్ స్టైల్ కూడా అచ్చం షమీలానే ఉంది. ఇతను షమీకి పెద్ద అభిమానని చెప్పుకొచ్చాడు. ఆ మధ్య కొచ్చిలో టీ దుకాణం నడుపుతున్న ఓ వ్యక్తి అచ్చం రజనీ సార్ పోలికలతో వైరల్ అయిన విషయం తెలిసిందే..

ఇది కూడా చదవండి: అశ్వగంధ పొడిని పాలల్లో కలిపి తాగితే ఇన్ని అద్భుతాలా?


ఈ వీడియోను RVCJ Media అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'మహమ్మద్ షమీకి కవల సోదరుడు' అనే క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'షమీ తమ్ముడు అచ్చం షమీలాగే ఉంటాడు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి కూడా షమీలాగా ఉన్నాడు' అని ఒకరు కామెంట్ చేశారు. 'అవును ఇతను కూడా షమీ లాగే ఉన్నాడు కదా.. ఇతనికి అర్జున అవార్డు రాలేదా?' అని ఇంకొకరు కామెంట్ చేసారు. 'వీడియో ఫస్ట్ టైమ్ చూడగానే అందరూ షమీనే అనుకుంటారు. అంత దగ్గరి పోలికలున్నాయి ఇద్దరికీ' అని మరొకరు అన్నారు.

ఇది కూడా చదవండి: 30ఏళ్ల తర్వాత బలంగా ఉండాలంటే.. తినాల్సిన ఆహారాల లిస్ట్ ఇదీ..!

మరిన్ని వైరల్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 12 , 2024 | 02:40 PM