30ఏళ్ల తర్వాత బలంగా ఉండాలంటే.. తినాల్సిన ఆహారాల  లిస్ట్ ఇదీ..!

30ఏళ్లు దాటగానే శరీరంలో మెల్లిగా శక్తి తగ్గడం మొదలవుతుంది. ఈ ఆహారాలు తింటే బలంగా ఉంటారు.

కాల్షియం, విటమిన్-డి  పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. విటమిన్-డి, పాలు, పెరుగు, చీజ్, బాదం తప్పకుండా తీసుకోవాలి.

ఫ్రీరాడికల్స్  యవ్వనంగా  కనిపించే   కణజాలాలను  తగ్గిస్తాయి.  వీటిని నిర్మూలించడానికి యాంటీఆక్సిడెంట్ ఆహారాలు తీసుకోవాలి. సిట్రస్ పండ్లు, బ్లూబెర్రీస్, బ్రౌన్ రైస్, గ్రీన్ టీ వంటివి తీసుకోవాలి.

నిద్ర బాగా పట్టడానికి  రాత్రి పడుకునేముందు పసుపు పాలు. లేదా సాధారణ పాలు తీసుకోవాలి.

30ఏళ్లు దాటితే బీపీ పెరిగే అవకాశం ఎక్కువ. బీపీని నియంత్రించడానికి పొటాషియం పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. బీన్స్, టమోటా, బంగాళాదుంప, అరటి పండ్లలో పొటాషియం ఉంటుంది.

ఫైబర్ పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకుంటే జీర్ణక్రియ బాగుంటుంది.  మలబద్దకం, మొలలు లాంటి సమస్యలు రావు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు బాగా తీసుకోవాలి.

చిన్నవయసులోనే గుండె సంబంధ సమస్యలు రాకూడదు అంటే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న ఆహారాలు పుష్కలంగా తీసుకోవాలి.  వాల్నట్స్, బాదం, చియా గింజలు తీసుకోవాలి.

కండరాల సామర్థ్యానికి, మరమ్మత్తుకు ప్రోటీన్ చాలా అవసరం. మాంసాహారం తినలేకపోతే గ్రీక్ యోగర్ట్, కాయధాన్యాలు, చిక్కుళ్లు, క్వినోవా, బీన్స్, జున్ను వంటివి తీసుకోవాలి.