Share News

Viral Video: వామ్మో.. ఎర్రనాగు.. గూస్ బంప్స్ తెప్పించే వీడియో!

ABN , Publish Date - Mar 18 , 2024 | 08:59 PM

ఎర్రనాగు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: వామ్మో.. ఎర్రనాగు.. గూస్ బంప్స్ తెప్పించే వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. కానీ మనిషికి తెలిసినవి కొన్నే! అందుకే అడవి జంతువుల వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ (Viral Video) అవుతుంటాయి. వన్యప్రాణులపై చాలా మందికి అంత అవగాహన ఉండక వాటిని చూసి ఆశ్చర్యపోతుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్రెండింగ్‌లో ఉంది. ఇందులోని ఎర్రనాగును (Red colored Cobra) చూసి జనాలు భయపడుతున్నారు. మరి కొందరేమో అసలు ఈ పాము నిజమైనదేనా? అనే సందేహం కూడా వ్యక్తం చేశారు.

Viral: ఎదురుగా ఉన్నది పోలీస్.. అదీ ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అని తెలీక..

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఇటుకల మధ్య దాక్కున్న ఆ ఎర్ర పామును ఓ వ్యక్తి చాకచక్యంగా బయటకు లాగుతాడు. ఈ క్రమంలో అది నాగులాగా పడగవిప్పి బుసకొట్టింది. కానీ, తన తోకను పట్టుకున్న వ్యక్తివైపు మాత్రం తిరగదు. మరోవైపు, ఆ వ్యక్తి పామును అటూ ఇటూ కదుపుతూ పరిశీలించే ప్రయత్నం చేశాడు. వీడియో అక్కడితో ముగిసిపోవడంతో తరువాత ఏం జరిగిందో తెలియరాలేదు.

Viral: ఈ లేడీ డాక్టర్‌ను మెచ్చుకోకుండా ఉండలేం.. ఈమె సూచనలను తూచాతప్పకుండా పాటిస్తే..


అయితే, రక్తవర్ణంలో ఉన్న ఈ పాము జనాలను భయభ్రాంతులకు గురి చేసింది. ఇలాంటి పామును తాము ఎక్కడా చూడలేదని అనేక మంది కామెంట్ చేశారు. నలుపు, తెలుపు, ఆకుపచ్చ, చివరకు లేత పసుపుపచ్చ రంగుల్లోని పాములను చూశాము కానీ ఇలాంటిది ఎక్కడా చూడలేదనే కామెంట్లు వెల్లువెత్తాయి. వీడియోకు విపరీతంగా వ్యూస్ వచ్చాయి. ఈ పాము నిజమైనది కాదేమో, గ్రాఫిక్స్ లేదా మరేదైనా టెక్నిక్‌తో వీడియో సృష్టించారేమో అన్న వారు కూడా ఉన్నారు.

Anand Mahindra: కుక్క చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం! లైఫ్‌లో ఇలా ఎవరైనా చేస్తే..

అయితే, ఇది నిజమైనదేనని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. అతడు తెలిపిన దాని ప్రకారం, ఈ పామును ఆంగ్ల భాషలో రెడ్ స్పిట్టింగ్ కోబ్రా (Red Spitting Cobra) అని అంటారు. ఈజిప్ట్, టాంజానియా, ఉగాండా, సుడాన్ వంటి ఆఫ్రికా దేశాల్లో ఇది ఉంటుందట. చాలా అరుదుగా మాత్రమే ఇది మనిషి కంట పడుతుందట. ఇది ఇతర జంతువుల కళ్లల్లోకి నేరుగా విషం చిమ్మి తప్పించుకుంటుంది. పేరుకు ఇది రెడ్ స్పిట్టింగ్ కోబ్రానే అయినప్పటికీ ఈ జాతి పాములు ఇతర రంగుల్లో కూడా ఉంటాయని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే, నెటిజన్లకు వీడియోపై మాత్రం పూర్తిగా సందేహాలు తొలగిపోలేదు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 08:59 PM