Share News

Viral: ఎదురుగా ఉన్నది పోలీస్.. అదీ ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అని తెలీక..

ABN , Publish Date - Mar 18 , 2024 | 06:02 PM

ఎవరినైనా బోల్తా కొట్టించి చోరీ చేయగలమనుకున్న ఇద్దరు దొంగలకు భారీ షాక్ తగిలింది. ఎదురుగా ఉన్నది ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అని తెలీక చేతివాటం ప్రదర్శించబోయి చివరకు దెబ్బైపోయారు.

Viral: ఎదురుగా ఉన్నది పోలీస్.. అదీ ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అని తెలీక..

ఇంటర్నెట్ డెస్క్: ఎవరినైనా బోల్తా కొట్టించి చోరీ చేయగలమనుకున్న ఇద్దరు దొంగలకు భారీ షాక్ తగిలింది. ఎదురుగా ఉన్నది ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ (Encounter Specialist) అని తెలీక చేతివాటం ప్రదర్శించబోయి చివరకు దెబ్బైపోయారు. ఢిల్లీలోని (New Delhi) చాణక్యపురి ప్రాంతంలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.

Uber: గూగుల్ ఇంజినీర్‌కు షాకింగ్ అనుభవం.. ఊబెర్ డ్రైవర్ స్పీకర్ ఆన్ చేసి ఫోను మాట్లాడటంతో..

ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగంలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అయిన వినోద్ బడోలా ఇటీవల ఓ రోజు సాయంత్రం వాకింగ్ చేసేందుకని నెహ్రూ పార్క్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు దుండగులు ఊహించని విధంగా ఆయనపై దాడి చేశారు. వారిలో ఒకరు వినోద్ ముక్కుమీద బలంగా కొట్టడంతో ఆయన కిందపడిపోయారు. మరో వ్యక్తి ఆయన మెడలోని చైన్‌ను తెంపుకుని పారిపోయేందుకు ట్రై చేశాడు (Snatchers target encounter specialist cop in Delhi ). ఇంతలోనే సీన్ ఊహించని మలుపు తిరిగింది.

Viral: ఈ లేడీ డాక్టర్‌ను మెచ్చుకోకుండా ఉండలేం.. ఈమె సూచనలను తూచాతప్పకుండా పాటిస్తే..


పోలీసు విధుల్లో రాటుదేలిన వినోద్..దొంగల దాడి నుంచి క్షణాల్లో తేరుకుని తిరగబడ్డారు. గౌరవ్ అనే దొంగను నిలువరించి అదుపులోకి తీసుకున్నాడు. వినోద్ ధాటికి బెంబేలెత్తిపోయిన మరో దొంగ పవన్ వెంటనే పారిపోయాడు. ఈ క్రమంలో వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వారి సాయంతో పవన్‌ను వెంబడించి అరెస్టు చేశారు. కాగా, నిందితులపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్టు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.

అసాంఘిక శక్తుల పనిపట్టడంలో సిద్ధహస్తుడైన వినోద్ గతంలో తన ధైర్యసాహసాలకు ప్రెసిడెన్షియల్ అవార్డునూ అందుకున్నారు. పలువురు ఉగ్రమూకల ఆట కూడా కట్టించారు.

Anand Mahindra: కుక్క చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం! లైఫ్‌లో ఇలా ఎవరైనా చేస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 06:08 PM