Share News

Uber: గూగుల్ ఇంజినీర్‌కు షాకింగ్ అనుభవం.. ఊబెర్ డ్రైవర్ స్పీకర్ ఆన్ చేసి ఫోను మాట్లాడటంతో..

ABN , Publish Date - Mar 18 , 2024 | 05:26 PM

బెంగళూరులో తొలిసారి ఊబెర్ క్యాబ్‌ బుక్ చేసిన ఓ గూగుల్ టెకీకి షాకింగ్ అనుభవం ఎదురైంది. దీంతో దిమ్మెరపోయిన అతడు నెట్టింట జరిగిన ఉదంతం గురించి షేర్ చేశాడు.

Uber: గూగుల్ ఇంజినీర్‌కు షాకింగ్ అనుభవం.. ఊబెర్ డ్రైవర్ స్పీకర్ ఆన్ చేసి ఫోను మాట్లాడటంతో..

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో (Bengaluru) తొలిసారి ఊబెర్ క్యాబ్‌ బుక్ (Uber Cab Ride) చేసిన ఓ గూగుల్ టెకీకి షాకింగ్ అనుభవం (Bad Experience) ఎదురైంది. దీంతో దిమ్మెరపోయిన అతడు నెట్టింట జరిగిన ఉదంతం గురించి షేర్ చేశాడు. ఘటనపై పెద్ద ఎత్తున స్పందన (Viral) రావడంతో చివరకు ఊబెర్ కూడా స్పందించింది.

బాదితుడు తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల అతడు తన స్నేహితుడితో కలసి ఊబెర్ క్యాబ్ బుక్ చేశాడు. జర్నీ మొత్తం 1.5 గంటలని యాప్‌లో చూపించింది. అయితే, ప్రయాణం మొదలైన దగ్గర నుంచీ డ్రైవర్ ఫోను‌లో మాట్లాడటం ప్రారంభించాడు. స్పీకర్ ఆన్ చేసి పెద్ద శబ్దంతో మాట్లాడాడు. అరగంట అయినా డ్రైవర్ ఫోన్ కాల్ ముగించకుండా, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడటంతో వెనక సీట్లోని బాధితుడు, అతడి స్నేహితుడికి చిరాకొచ్చింది.

Viral: ఈ లేడీ డాక్టర్‌ను మెచ్చుకోకుండా ఉండలేం.. ఈమె సూచనలను తూచాతప్పకుండా పాటిస్తే..

అయినా కూడా తమాయించుకున్న వారు ఫోన్ కాల్ ఆపాలని చాలా మర్యాదగా డ్రైవర్‌కు సూచించారు. దీంతో, ఒక్కసారిగా రెచ్చిపోయిన అతడు టెకీపై నానా మాటలతో విరుచుకుపడ్డాడు. నేను మీతో ప్రయాణించలేనంటూ కస్టమర్లను రోడ్డు మధ్యలో దింపేశాడు. దీంతో, దిమ్మెరపోయిన వారు చివరకు ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నారు (Google techie shares bad experience with Bengaluru Uber driver).


ఇలాంటి దారుణ అనుభవం తనకు ఎన్నడూ ఎదురుకాలేదని బాధితుడు వాపోయాడు. అతడి ఫోన్ కాల్‌తో తనకు తలనొప్పి వచ్చేసిందన్నాడు. డ్రైవర్ ఇలా చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నాడు. ఘటన వైరల్ కావడంతో ఊబెర్ కూడా స్పందించింది. డ్రైవర్ చేసింది తప్పేనని అంగీకరించింది. బాధితుడు తన రైడ్ వివరాలను వ్యక్తిగతంగా మెసేజ్ చేస్తే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Anand Mahindra: కుక్క చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం! లైఫ్‌లో ఇలా ఎవరైనా చేస్తే..

ఊబెర్ సమాధానంతో సంతృప్తి చెందిన గూగుల్ టెకీ..ప్యాసెంజర్ల భద్రత కోసం కొన్ని సూచనలు చేశాడు. డ్రైవర్లు కారులో ఏసీ వేయకపోయినా, ఇష్టారీతిన ఫోన్ వాడినా ఫిర్యాదు చేసేందుకు కస్టమర్లకు యాప్‌లో ఆప్షన్ ఉండాలని సూచించారు. కారులోని పరిస్థితిని రుజువు చేసేందుకు వీలుగా ఫొటోలను అప్పటికప్పుడు అప్‌లోడ్ చేసే అవకాశం కూడా ఉండాలన్నారు. కాగా, ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తామూ ఇలాంటి పరిస్థితి గతంలో ఎదుర్కొన్నామని అనేక మంది చెప్పారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 05:30 PM