Share News

Viral: ఈ లేడీ డాక్టర్‌ను మెచ్చుకోకుండా ఉండలేం.. ఈమె సూచనలను తూచాతప్పకుండా పాటిస్తే..

ABN , Publish Date - Mar 18 , 2024 | 04:22 PM

బెంగళూరు డాక్టర్ సూచించిన నీటి పొదుపు చిట్కాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Viral: ఈ లేడీ డాక్టర్‌ను మెచ్చుకోకుండా ఉండలేం.. ఈమె సూచనలను తూచాతప్పకుండా పాటిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు మహానగరం ప్రస్తుతం నీటి కొరతతో సతమతమవుతోంది. దీంతో, నీటి పొదుపు చిట్కాలు, ఐడియాలు నెట్టింట వెల్లువెత్తుతున్నాయి. అనేక మంది తమకు చేతనైనంత మేర నీటిని పొదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ ఆలోచనలను నెట్టింట పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వైద్యురాలు (Bengaluru Doctor) తాను రోజుకు 600 లీటర్లకు పైగా నీరు పొదుపు చేస్తున్నానంటూ కలకలం రేపారు. తన చిట్కాలు పాటిస్తే ఎవరైనా బోలెడన్నీ నీళ్లను ఆదా చేసుకోవచ్చని (Water Saving Tips) అన్నారు. దీంతో, ఆమె ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.

Viral: ఇదేంటి తల్లీ.. నువ్వే ఇలా ఉంటే ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటో? నెట్టింట టీచర్ వీడియో వైరల్!

డా. దివ్యాశర్మ ఈ చిట్కాలను నెట్టింట షేర్ చేశారు. షవర్ వాడటం మానేసి ఇంటిల్లపాదీ తలాఒక బకేట్ నీళ్లతో మాత్రమే స్నానం చేస్తున్నామని చెప్పారు. దీంతో, ఒక్కో మనిషికి సగటున 45 లీటర్ల మేర నీరు ఆదాఅవుతోందన్నారు. ఇలా ఇంట్లోని నలుగురు సభ్యులు రోజుకు 180 లీటర్ల నీటిని పొదుపు చేస్తున్నామన్నారు.

ఇంట్లో ఉన్న నల్లాల ఏయిరేటర్లను సరి చేశామని చెప్పారు. ఏయిరేటర్ వాడకం ద్వారా 80 శాతం నీటిని పొదుపు చేయొచ్చన్నారు. రోజుకు ఒక్కసారి మాత్రమే అంట్లు తోమడం.. అది కూడా డిష్ వాషర్ వినియోగించడంతో నీటి వినియోగం బాగా తగ్గిపోయిందన్నారు. ఫలితంగా రోజుకు 360 లీటర్ల మేర నీరు పొదుపు అవుతోందన్నారు.

2.jpg


ఇక ఆర్వో విడుదల చేసే వ్యర్థ జలాలను కంటెయినర్‌లో నింపి వాటిని ఇల్లు శుభ్రం చేయడానికి, మొక్కలకు నీళ్లు పోయడానికి వినియోగిస్తున్నామని చెప్పారు. దీంతో 30 లీటర్లకు పైగా నీరు ఆదా అవుతోందన్నారు.

కార్లను నీటితో కడగడం పూర్తిగా మానేశామన్నారు. దీనికి బదులు ప్రతిరోజు కారు మీదున్న దుమ్ము దులపడంతో పాటూ రోజు విడిచి రోజు దాన్ని తడి గుడ్డతో తుడుస్తుంటే మంచి ఫలితం ఉంటోందని చెప్పారు. వాషింగ్‌మెషీన్‌లో ఫుల్ లోడ్ దుస్తులు వేశాకే ఆన్ చేస్తున్నామని, ఫలితంగా నీటి వినియోగం తగ్గుతోందన్నారు. దీంతో, 30 లీటర్లకు పైగా నీటిని పొదుపు అవుతోందన్నారు.

Anand Mahindra: కుక్క చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం! లైఫ్‌లో ఇలా ఎవరైనా చేస్తే..

మొత్తంగా చూస్తే ఈ చిట్కాలతోనే తమ కుటుంబం రోజుకు 600 లీటర్ల నీటికి పైగా పొదుపు చేస్తోందని చెప్పారు. ఈ టిప్స్‌ను అందరూ ఫాలో అవ్వాలని, నీటిని పొదుపు చేయాలని చెప్పారు. డాక్టర్ స్వయంగా ఆచరించి, ఫలితాన్ని లెక్కలతో సహా చూపించడంతో ఈ నీటి పొదుపు ఐడియాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంత క్లియర్‌గా సూచనలు చెప్పిన డాక్టర్‌ను మెచ్చుకోకుండా ఉండలేమని కొందరు కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 04:26 PM