Share News

Lakshadweep: లక్షద్వీప్ లో ఫ్లైట్ ల్యాండింగ్ సైతం అద్భుతమే.. వీడియోపై మీరూ ఓ లుక్కేసేయండి..

ABN , Publish Date - Jan 09 , 2024 | 10:50 AM

ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్స్ మంత్రులు అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. దీనికి భారత్ కూడా ఘాటుగా

Lakshadweep: లక్షద్వీప్ లో ఫ్లైట్ ల్యాండింగ్ సైతం అద్భుతమే.. వీడియోపై మీరూ ఓ లుక్కేసేయండి..

ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్స్ మంత్రులు అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. దీనికి భారత్ కూడా ఘాటుగా స్పందిస్తోంది. దీంతో.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షద్వీప్‌పై చర్చ జరుగుతోంది. ఇటీవల ప్రధాని మోడీ ఈ అద్భుతమైన, అందమైన ద్వీపసమూహాన్ని సందర్శించారు. అందుకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. దీనిపై పలువురు భారతీయ టూరిజంపై మనసు పారేసుకున్నారు. సెలవులను ఎంజాయ్ చేసేందుకు మాల్దీవుల కంటే లక్షద్వీప్ మంచి ప్రదేశం అని పేర్కొన్నారు. అయితే.. భారత్ ప్రధాన భూభాగం నుంచి లక్షద్వీప్‌ కు రోడ్డు మార్గం లేకపోవడంతో వాయుమార్గంలోనే వెళ్లాలి. ఈ క్రమంలో అక్కడ ఉన్న విమానాశ్రయానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

లక్షద్వీప్‌లోని ఈ ఏకైక విమానాశ్రయం అగతి ద్వీపంలో ఉంది. దీనిని అగతి ఎయిర్ పోర్ట్ గా పిలుస్తారు. ఈ విమానాశ్రయం పొడవు 1204 మీటర్లు, వెడల్పు 30 మీటర్లు మాత్రమే. చుట్టూ సముద్రపు నీరు ఉంటుంది. విమానాన్ని ల్యాండింగ్ చేసేటప్పుడు లేదా టేకాఫ్ చేసేటప్పుడు పైలట్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. విమానం ల్యాండింగ్‌కు సంబంధించిన ఈ వీడియో.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 27 సెకన్లు నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటివరకు 7.5 మిలియన్లు వ్యూస్ రాగా.. 98 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 01:00 PM