Share News

Swiggy: పాపం.. పిల్లల కోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ.. ఆ డెలివరీ బాయ్ చేసిన నిర్వాకమిదీ..!

ABN , Publish Date - Feb 08 , 2024 | 01:10 PM

పాపం.. పిల్లలకోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళకు ఊహించని అనుభవం ఎదురయ్యింది.

Swiggy: పాపం.. పిల్లల కోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ.. ఆ డెలివరీ  బాయ్ చేసిన నిర్వాకమిదీ..!

ఇప్పట్లో చాలామంది ఆకలిగా అనిపించగానే వంటగదిలోకెళ్లి ఆహారం వండుకోవడం కంటే ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చెయ్యడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరు తాము రుచిగా వండుకోలేని ఆహారాలను ఆర్డర్ చేస్తుంటారు. ఓ మహిళ తన పిల్లల కోసం ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ అయిన స్విగ్గీలో ఆహారం ఆర్డర్ చెయ్యగా ఆమెకు ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఆ డెలివరీ బాయ్ చేసిన నిర్వాకాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

నేహా అనే ఒక మహిళ తన పిల్లల కోసం రెండు మహారాజ్ వడాపావ్, ఒక క్రంచీ రోల్ స్విగ్గీలో ఆర్డర్ చేసింది. వీటికి ప్లాట్ ఫాట్ ఫీజ్.. ట్యాక్స్ తో కలిపి రూ.349 అయ్యాయి. ఫుడ్ ఆర్డర్ తరువాత మహిళ డెలివరీ బాయ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తుండగా ఆమెకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురయ్యింది. డెలివరీ బాయ్ తాను ఫుడ్ డెలివరీ చేయలేనని, నా దగ్గర టైం లేదు, నేనేం చెయ్యాలి, లేకపోతే ఆర్డర్ తెచ్చేవాన్ని అంటూ ఆమెకు సందేశం పంపాడు. ఈ విషయాన్ని Neha S అనే ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ నుండి పంచుకుంది. ఇప్పుడు నేనెక్కడికి వెళ్లాలి? అంటూ ఈ పోస్ట్ కు క్యాప్షన్ మెన్షన్ చేసింది.

ఇది కూడా చదవండి: వాస్తు ప్రకారం పడకగదిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.


నేహా ట్విట్టర్ లో పంచుకున్న ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. ఈ వార్త స్విగ్గీ దృష్టికి వెళ్లింది. దీంతో స్విగ్గీ దీనిపై స్పందించింది. నేహా సమస్యను కాల్ ద్వారా పరిష్కరించామని, ఆమెకు డబ్బు రిఫండ్ చేశామని చెప్పుకొచ్చింది. కాగా నేహా ట్విట్టర్ పోస్ట్ చూసిన నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. వీధిలో సులువుగా రూ.15కు లభించే వడపావ్ ను స్విగ్గీలో రూ. 100కు కొనుగోలుచేయడం ఏంటని అంటున్నారు. స్విగ్గీలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయని, డెలివరీ బాయ్ లు చాలామంది ఆర్డర్ డెలివరీ చేసినట్టు మెన్షన్ చేసి ఫుడ్ తామే తీసుకెళ్లిపోతున్నారని అంటున్నారు.

ఇది కూడా చదవండి: చిటికెడు జాజికాయ పొడిని రోజూ తీసుకుంటే.. జరిగేదిదే..!

మరిన్ని వైరల్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 08 , 2024 | 01:17 PM