వాస్తు ప్రకారం పడకగదిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

పడకగదిలో దక్షిణం, పడమర లేదా నైరుతి మూలలోనే మంచం ఉండాలి. తల కూడా అదే దిక్కులలో ఉండేలా  నిద్రించాలి.

గులాబీ, తెలుపు, బ్రౌన్ షేడ్ లేదా లేత రంగు బెడ్ షీట్లను ఉపయోగించాలి. ఎక్కువ గీతలు, డిజైన్లు ఉన్న బెడ్ షీట్లను దూరం పెట్టాలి.

పడకగదిలో రేడియేషన్ నివారించడానికి ల్యాప్టాప్, సెల్ఫోన్, టీవి వంటి అన్ని ఎలక్ట్రాన్ వస్తువులను నిద్రపోవడానికి గంట ముందే ఆఫ్ చేయాలి.

నిద్రపోవడానికి ముందు మంచి సంగీతం వినాలి. ఒత్తిడిని తగ్గించడానికి ప్రశాంతమైన నిద్ర పట్టడానికి సంగీతం సహకరిస్తుంది.

పడకగదిలో గులాబీ, జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ ను నీటిలో వేసి ఆయిల్ డిఫ్యూషర్ సాయంతో వేడి చేయాలి. ఈ సువాసన నిద్రను ప్రేరేపిస్తుంది.

మంచం కింద ఏవీ ఉంచకూడదు. మంచాల కింద ఏవైనా ఉంటే అవి శక్తి క్షేత్రానికి అంతరాయం కలిగిస్తాయి. ఫలితంగా నిద్ర దెబ్బతింటుంది.

ఉత్తరం వైపు ఎట్టి పరిస్థితులలోనూ తలపెట్టి నిద్రపోకూడదు. ఉత్తరం  సానుకూల దిశ, మనిషి తలలో ఉన్న చక్రం కూడా సానుకూలంగా ఉంటుంది. ఇవి రెండూ సంఘర్షణ చెందితే ప్రతికూల ఫలితాలు ఉంటాయి.

మంచం తలుపుకు ఎదురుగా ఉండకూడదు.  అలాగే మంచానికి ఎదురుగా, వెనుక తలుపులు ఉండకూడదు.

నిద్రలేవగానే ఎవరి ప్రతిబింబాన్ని వారు చూడకూడదని వాస్తు చెబుతుంది.  అందుకే అద్దం లేదా గాజు వస్తువులు, టీవి స్క్రీన్ వంటివి మంచానికి ఎదురుగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే నిద్రించే సమయంలో వాటిమీద గుడ్డ కప్పాలి.