Share News

Phone Camera: స్మార్ట్ ఫోన్ కెమెరా క్లీన్ చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.. లేకపోతే చాలా నష్టపోతారు..!

ABN , Publish Date - May 15 , 2024 | 04:51 PM

స్మార్ట్ ఫోన్ లో ఫొటోలు తీయడమనే అభిరుచి ప్రజలలో రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి అనుగుణంగానే వివిధ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కెమెరాను ఎంతో మన్నికగా అందిస్తున్నాయి. అయితే ఫొటోలు బాగా రావడం కోసం కొందరు కెమెరాలను శుభ్రం చేస్తుంటారు. అలా శుభ్రం చేసేటప్పుడు ఈ కింది విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.

Phone Camera: స్మార్ట్ ఫోన్ కెమెరా క్లీన్ చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.. లేకపోతే చాలా నష్టపోతారు..!

ప్రస్తుత కాలంలో ప్రపంచం మొత్తాన్ని చాలామంది కేవలం చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ నుండే సందర్శిస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవడమే కాకుండా స్మార్ట్ ఫోన్ లో ఉండే వివిధ ఫీచర్స్ పుణ్యమా అని కొత్త స్కిల్స్ కూడా నేర్చుకుంటున్నారు. అలాంటి వాటిలో ఫొటోగ్రఫీ కూడా ఒకటి. స్మార్ట్ ఫోన్ లో ఫొటోలు తీయడమనే అభిరుచి ప్రజలలో రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి అనుగుణంగానే వివిధ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కెమెరాను ఎంతో మన్నికగా అందిస్తున్నాయి. అయితే ఫొటోలు బాగా రావడం కోసం కొందరు కెమెరాలను శుభ్రం చేస్తుంటారు. అలా శుభ్రం చేసేటప్పుడు ఈ కింది విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే కెమెరా లెన్స్ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది.

పాటించాల్సినవి..

స్మార్ట్‌ఫోన్ కెమెరాను సురక్షితంగా ఉంచడానికి ఫోన్‌ను శుభ్రమైన ప్రదేశంలో.. దుమ్ము, ధూళికి దూరంగా ఉంచడం ముఖ్యం. అలాగే కెమెరాను ఎలాంటి గీతలు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

చాలా మంది ఫోన్‌ని క్లీన్ చేసేటప్పుడు స్విచ్ఛాఫ్ చేయరు. దీనివల్ల డ్యామేజ్ జరుగుతుంది. ఇలాంటి డ్యామేజ్‌ను నివారించాలనుకుంటే ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత శుభ్రం చేయాలి.

మానసికంగా అలసిపోయినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే..!


ఫోన్ కెమెరా లెన్స్‌ను ఎలాంటి గీతలు పడకుండా కాపాడటానికి మృదువైన వస్త్రాన్ని ఉపయోగించండి.

ఫోన్ కెమెరా లెన్స్‌ను శుభ్రం చేయడానికి ఉత్తమ మార్గం కెమెరాను వృత్తాకార కదలికలో శుభ్రం చేయడం.

కెమెరా మెరుగ్గా పనిచేయాలంటే, లెన్స్‌ను క్లీనర్‌తో శుభ్రం చేయడం మంచిది. దీంతో కెమెరా లెన్స్‌పై ఉన్న మురికి బాగా క్లీన్ అవుతుంది.

కెమెరా లెన్స్ మెరుగైన సామర్థ్యంతో పని చేస్తుందని నిర్ధారించుకోవడానికి లెన్స్ చుట్టూ కూడా పూర్తిగా శుభ్రం చేయండి. మృదువైన బ్రష్‌తో కెమెరా లెన్స్‌ను శుభ్రం చేయవచ్చు.

బెకింగ్ కోసం మైదాకు బదులుగా వాడుకోదగిన 7 రకాల పిండులు ఇవీ..!


ఈ తప్పులు చేయకండి..

ఫోన్ కెమెరా లెన్స్‌పై నేరుగా క్లీనర్‌ను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల లెన్స్‌పై గీతలు పడవచ్చు.

లెన్స్‌లు సురక్షితంగా ఉండాలంటే కఠినమైన వస్తువులను ఉపయోగించకూడదు. SIM ఎజెక్టర్ టూల్, సేఫ్టీ పిన్‌ని ఉపయోగించకూడదు.

ఫోన్‌లో అందించిన కెమెరా లెన్స్ చాలా సున్నితమైనది. దానిపై ఎక్కువ ఒత్తిడి చేయకూడదు. లేకుంటే దానిపై గీతలు పడే అవకాశం ఉంటుంది.

లెన్స్‌పై ఎప్పుడూ ఆయిల్ హ్యాండ్‌లతో టచ్ చేయకూడదు. ఇది లెన్స్ సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

బెకింగ్ కోసం మైదాకు బదులుగా వాడుకోదగిన 7 రకాల పిండులు ఇవీ..!

మానసికంగా అలసిపోయినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - May 15 , 2024 | 04:52 PM