Share News

Viral: పాన్ షాపు వద్ద యువతి ధూమపానం.. తనను గుచ్చిగుచ్చి చూసిన యువకుడిని..

ABN , Publish Date - Apr 08 , 2024 | 08:14 PM

పాన్‌ షాపు వద్ద పొగతాగుతున్న ఓ యువతి తనను గుచ్చిగుచ్చి చూస్తున్నాడంటూ మరో యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ దారుణం వెలుగు చూసింది.

Viral: పాన్ షాపు వద్ద యువతి ధూమపానం.. తనను గుచ్చిగుచ్చి చూసిన యువకుడిని..

ఇంటర్నెట్ డెస్క్: సిగరెట్ తాగేందుకు పాన్ షాపునకు వచ్చిన ఓ యువతి ఊహించని దారుణానికి ఒడిగట్టింది. తనను అదేపనిగా చూస్తున్నాడంటూ ఎదురుగా ఉన్న యువకుడిని కత్తితో పొడిచి చంపేసింది. మహారాష్ట్రలోని (Maharashtra) నాగ్‌పూర్‌లో శనివారం వెలుగు చూసిన ఈ ఉదంతం స్థానికంగా పెను కలకలానికి దారి తీసింది.

Viral: చిరుతకే షాకిచ్చిన రైతు.. బిత్తరపోయిన క్రూర మృగం.. వైరల్ వీడియో

స్థానిక మీడియా కథనాల ప్రకారం, నాగ్‌పూర్‌లోని (Nagpur) మనేవాడా సిమెంట్‌ రోడ్డులోని పాన్ షాపు వద్దకు శనివారం సాయంత్రం జయశ్రీ పంధారే అనే 24 ఏళ్ల యువతి వచ్చింది. అక్కడ పొగతాగుతున్న ఆమె ఎదురుగా ఉన్న మరో కస్టమర్ రంజిత్ రాథోడ్‌తో (28) గొడవ పడింది. తనను ఎందుకు గుచ్చిగుచ్చి చూస్తున్నావంటూ వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో రంజిత్.. జయశ్రీ తీరును కెమెరాతో రికార్డు చేయడం ప్రారంభించాడు. దీంతో, వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో రెచ్చిపోయిన జయశ్రీ తన ఇద్దరు ఫ్రెండ్స్ ఆకాశ్ రౌత్, జీతూ జాదవ్‌ను అక్కడికి పిలిపించింది. ఆ తరువాత కొంతసేపు వారు గొడవపడ్డాక రంజీత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Viral: ఉబెర్ డ్రైవర్ ఫోను సంభాషణ విన్న ప్యాసెంజర్.. ఆ తరువాత ఊహించని విధంగా..


అయితే, జయశ్రీ తన స్నేహితులతో కలిసి రంజిత్‌ను మహాలక్ష్మీ నగర్ వద్ద మరోసారి అడ్డగించి గొడవకు దిగింది. చివరకు ఆమె విచక్షణ మరిచి రంజిత్‌ను కత్తితో పొడిచి చంపేసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. స్థానిక సీసీటీవీ కెమెరాలో ఈ దారుణం మొత్తం రికార్డైంది. ఇక ఘటన సమాచారం అందగానే రంగంలోకి దిగిన పోలీసులు జయశ్రీని, ఆమె ఫ్రెండ్స్ ఆకాశ్, సవితలను అరెస్టు చేశారు (Nagpur Man Stabbed Fatally For Staring At Woman Smoking At Paan Shop).

మృతుడు రంజిత్‌కు నలుగురు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. అతడి మొబైల్ ఫోన్‌లోని వీడియో రికార్డింగ్, స్థానిక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ ప్రారంభించామని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ సందర్భంగా నిందితుల్లో ఒకరి ఫోన్లో డ్రగ్స్‌కు సంబంధించిన పలు అభ్యంతరకర చిత్రాలను పోలీసులు గుర్తించారు. ఇక, ఘటన జరిగిన పాన్ షాపు.. రాత్రి సమయాల్లో అసాంఘిక శక్తులకు అడ్డగా మారిందని స్థానికుడు ఒకరు తెలిపారు.

Viral: అర్ధరాత్రి విమానం దిగిన మహిళ..ఎయిర్‌పోర్టులో క్యాబ్ బుక్ చేస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 08 , 2024 | 08:31 PM