Share News

Viral: ఉబెర్ డ్రైవర్ ఫోను సంభాషణ విన్న ప్యాసెంజర్.. ఆ తరువాత ఊహించని విధంగా..

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:27 PM

ఉబెర్ డ్రైవర్ కష్టాలు తెలుసుకున్న ఓ ప్యాసెంజర్ అతడి కూతురికి తన డబ్బుతో స్కూలు బ్యాగు కొనిపెట్టాడు. ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Viral: ఉబెర్ డ్రైవర్ ఫోను సంభాషణ విన్న ప్యాసెంజర్.. ఆ తరువాత ఊహించని విధంగా..

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించాడో వ్యక్తి. తాను చేసిన పనిని వివరిస్తూ అతడు పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా (Viral) మారింది. అతడి దొడ్డ మనసు తెలుసుకున్న అనేక మంది ప్రశంసల జల్లు కురిపించారు. కిరణ్ వర్మ తాను ఉబెర్ డ్రైవర్‌కు ఎలా సాయపడ్డదీ నెట్టింట సుదీర్ఘ పోస్టులో రాసుకొచ్చాడు.

Viral: చిరుతకే షాకిచ్చిన రైతు.. బిత్తరపోయిన క్రూర మృగం.. వైరల్ వీడియో


‘‘ఈ రోజు నేనో ఉబెర్ క్యాబ్ బుక్ చేశా. కారు వచ్చాక జర్నీ ప్రారంభించా. ఈ క్రమంలో డ్రైవర్‌కు ఇంటి నుంచి పదే పదే ఫోన్లు వచ్చాయి. అతడేమో కాసేపు మాట్లాడి మధ్యలోనే పలు మార్లు డిస్కనెక్ట్ చేశాడు. నేను ఫోను మట్లాడమని అతడికి చెప్పా. ఫోన్ సౌండ్ పెద్దగా ఉండటంతో వారి సంభాషణ మొత్తం నాకు అవగతమైంది. ఫోనులో అతడి కూతురు మాట్లాడింది. కొత్త బ్యాగు కావాలని కోరింది. అతడేమో కాసేపు కూతురికి నచ్చచెప్పి చివరకు ఫోను తల్లికి ఇవ్వమని కూతురికి చెప్పాడు. భార్య ఫోను అందుకున్నాక అతడు తన ఇబ్బందిని వివరించాడు. మొన్ననే పుస్తకాలు కొనడం వల్ల ప్రస్తుతం డబ్బులకు కటకటగా ఉందని చెప్పాడు. రెండు రోజులు ఆగాక స్కూలు బ్యాగు కొంటానన్నాడు (Man buys school bag for uber drivers daugter) ’’

Viral: మండుటెండలో పెట్రోల్ బంక్‌కు వచ్చిన కుక్క ఏం చేసిందో చూస్తే..


‘‘ఇదంతా విన్న నాకు మనసు ద్రవించింది. వెంటనే ఏదోకటి చేయాలనుకున్నాను. ఆ తరువాత నేను దిగాల్సిన చోటు లొకేషన్‌ను మరో చోటుకు మార్చా. ఓ బ్యాగుల షాపు వద్దకు చేరుకున్నాక డ్రైవర్‌ను నాతో పాటు షాపులోకి రమ్మన్నాను. అతడు నాతో మారు మాట్లాడకుండా వచ్చాడు. ఆ తరువాత అతడి కూతురికి ఓ బ్యాగు కొనిచ్చాను. ఇందుకు డబ్బులు లేకపోవడంతో నా భార్య అకౌంట్లోంచి డబ్బులు చెల్లించాను. ఇది చూసి ఆటోడ్రైవర్ కళ్లల్లో ఆనందం తొణికిసలాడింది. అతడిని చూసి నా మనసు కూడా ఆనందంతో నిండిపోయింది’’ అని అతడు చెప్పుకొచ్చాడు. ఇదంతా విన్న నెటిజన్లు కిరణ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Viral: అర్ధరాత్రి విమానం దిగిన మహిళ..ఎయిర్‌పోర్టులో క్యాబ్ బుక్ చేస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 08 , 2024 | 04:34 PM