Share News

Viral: మండుటెండలో పెట్రోల్ బంక్‌కు వచ్చిన కుక్క ఏం చేసిందో చూస్తే..

ABN , Publish Date - Apr 07 , 2024 | 04:06 PM

మండుటెండలో అవస్థపడుతూ పెట్రోల్ బంక్‌కు వచ్చిన ఓ వీధి కుక్కపై నీళ్లు చల్లి ఉపశమనం కలిగించిన ఓ వ్యక్తిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Viral: మండుటెండలో పెట్రోల్ బంక్‌కు వచ్చిన కుక్క ఏం చేసిందో చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: అసలే ఎండాకాలం.. ఏసీలు, కూలర్ల ముందు కూర్చున్న మనుషులే సూర్యుడి ప్రతాపాన్ని(Summer Heat) తట్టుకోలేకపోతున్నారు. ఇక జంతువుల బాధలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే, మనుషులకు అలవాటు పడ్డ జంతువులు వారి సాయంతో ఎలా ఎండవేడి నుంచి ఉపశమనం పొందుతున్నాయో చెప్పే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి ఓసారి ఎండవేడికి తట్టుకోలేకపోతున్న వీధి కుక్క ఒంటిపై నీళ్లు పోసి ఉపశమనం కలుగుజేశాడు. అది అర్థం చేసుకున్న ఆ కుక్క ఇక తరచూ అతడి సాయం కోసం రావడం ప్రారంభించింది. ఇటీవల ఓ రోజు కూడా అది ఆ వ్యక్తి ఉన్న పెట్రోల్ బంక్‌కు వచ్చింది. అతడి ముందుకు వచ్చి నిలబడింది. సాయం చేయమనే అర్థం వచ్చేలా అక్కడే నిలబడి అతడిని చూస్తూ ఉండిపోయింది.

Viral: చిరుతకే షాకిచ్చిన రైతు.. బిత్తరపోయిన క్రూర మృగం.. వైరల్ వీడియో


దాని మనసు అర్థం చేసుకున్న వ్యక్తి కూడా వెంటనే రంగంలోకి దిగాడు. దానిపై దోసిలితో నీళ్లు జల్లుతూ ఎండవేడి నుంచి కుక్కకు ఉపశమనం కలిగించాడు (Man splashes water on street dog). ఇక అతడు పదే పదే నీళ్లు జల్లుతుంటే ఆ కుక్క షవర్ కింద ఉన్నట్టు తెగ ఎంజాయ్ చేసింది (Respite From Heat).

ఇక కుక్కే కదా అని నిర్లక్ష్యం చేయకుండా దానికి సాయపడ్డ వ్యక్తిపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. మనుషుల్లో దేవుళ్లంటే ఇలాంటి వాళ్లే అంటూ అనేక మంది కామెంట్ చేశారు. ఇబ్బందుల్లో ఉన్న ఎవరికైనా సాయపడటమే దైవత్వమని కొందరు అన్నారు. ఇలా చిన్న చిన్న సాయాలతోనే సమాజంలో సంతోషం వెల్లివిరుస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ వీడియో వైరల్‌గా మారింది.

Viral: షాకింగ్.. ఎంత పని చేసిందీ గంగిరెద్దు! సైలెంట్‌గా కనిపిస్తూనే ఒక్కసారిగా..

Viral: అర్ధరాత్రి విమానం దిగిన మహిళ..ఎయిర్‌పోర్టులో క్యాబ్ బుక్ చేస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2024 | 04:09 PM