Share News

Mahatma Gandhi: అమరవీరుల దినోత్సవంగా మహాత్మా గాంధీ వర్థంతి.. దీని వెనక పెద్ద కథే ఉందండోయ్..

ABN , Publish Date - Jan 30 , 2024 | 08:59 AM

దేశానికి స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి త్యాగానికి గుర్తుగా దేశవ్యాప్తంగా జనవరి 30న అమరవీరుల దినోత్సవం ( షహీద్ దివాస్ ) గా జరుపుకుంటారు.

Mahatma Gandhi: అమరవీరుల దినోత్సవంగా మహాత్మా గాంధీ వర్థంతి.. దీని వెనక పెద్ద కథే ఉందండోయ్..

దేశానికి స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి త్యాగానికి గుర్తుగా దేశవ్యాప్తంగా జనవరి 30న అమరవీరుల దినోత్సవం ( షహీద్ దివాస్ ) గా జరుపుకుంటారు. 1948లో న్యూఢిల్లీలోని బిర్లా హౌస్‌లోని సాయంత్రం ప్రార్థనల సమయంలో నాథూరామ్ గాడ్సే గాంధీజీని హత్య చేయడంతో దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ కీలకమైన వ్యక్తి. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం సాధించడానికి శాంతియుత, అహింసా పద్ధతులను ఉపయోగించారు. మహాత్మా గాంధీ జనవరి 30న మరణించిడం వల్ల ఆ రోజును షహీద్ దివస్‌గా భారత ప్రభుత్వం ప్రకటించింది.

1948 జనవరి 30 న మహాత్మా గాంధీ బిర్లా భవన్‌లో ప్రార్థనా సమావేశానికి వెళ్తున్న సమయంలో సాయంత్రం 5:17 గంటలకు, నాథూరామ్ గాడ్సే గాంధీ ఛాతీలోకి తుపాకీతో షూట్ చేశాడు. గాయపడిన వెంటనే జాతిపిత మరణించాడు. దార్శనికత కలిగిన గాంధీజీ అణగారిన, అట్టడుగు వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడారు చరిత్రలో చెరగని ముద్ర వేశారు. శాంతి, అహింస పద్ధతులను ప్రోత్సహించడంలో ప్రపంచ దేశాలపై మహాత్మా గాంధీ విశేష ప్రభావం చూపారు.


ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గాంధీజీ ప్రభావాన్ని గుర్తించింది. అతని జయంతి అక్టోబర్ 2ను అంతర్జాతీయ అహింసా దినంగా నిర్ణయించింది. అంతే కాకుండా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పాఠశాలల్లోని యువకుల మధ్య శాంతియుత సంఘర్షణ పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడానికి అహింస, శాంతి పాఠశాల దినోత్సవంగా పాటించింది.

ఈ రోజున రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, ప్రముఖులు, రాజకీయనేతలు, అధికారులు రాజ్ ఘాట్ స్మారక చిహ్నం వద్ద మహాత్మా గాంధీ సమాధి వద్ద అమరవీరులకు, మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. భారతీయ అమరవీరుల జ్ఞాపకార్థం ప్రజలు సైతం రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు. పాఠశాలల్లో విద్యార్ధులు దేశభక్తి గీతాలు ఆలపిస్తారు. నాటకాలు ప్రదర్శిస్తారు.

"మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 30 , 2024 | 10:13 AM