Share News

ఫ్రీగా ఫుడ్ పెట్టే కంపెనీలో జాబ్ కావాలంటూ నెట్టింట పోస్ట్! ఆ ఉద్యోగి శాలరీ ఎంతో తెలిసి జనాలకు షాక్!

ABN , Publish Date - Feb 17 , 2024 | 08:28 PM

తాను కంపెనీ మారాలనుకుంటున్నట్టు ఓ వ్యక్తి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. రోజుకు నాలుగు పూటలా ఉచితంగా పోషకాహారం పెట్టే సంస్థ ఉంటే చెప్పండంటూ అతడు పెట్టిన కండీషన్ చూసి జనాలు ఆశ్చర్యపోయారు.

 ఫ్రీగా ఫుడ్ పెట్టే కంపెనీలో జాబ్ కావాలంటూ నెట్టింట పోస్ట్! ఆ ఉద్యోగి శాలరీ ఎంతో తెలిసి జనాలకు షాక్!

ఇంటర్నెట్ డెస్క్: తాను కంపెనీ మారాలనుకుంటున్నట్టు ఓ వ్యక్తి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. రోజుకు నాలుగు పూటలా ఉచితంగా పోషకాహారం పెట్టే సంస్థ ఉంటే చెప్పండంటూ అతడు పెట్టిన కండీషన్ చూసి జనాలు ఆశ్చర్యపోయారు. అతడి జీతం గురించి తెలిసి గగ్గోలు పెడుతున్నారు. నెట్టింట ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌ (viralVideo) అవుతోంది.

Viral: ఛి ఛీ.. బాత్రూమ్‌లో అతడి డర్టీ పని చూసి మహిళకు షాక్.. అసలేం జరిగిందో తెలిస్తే..

సౌమిల్ త్రిపాఠీ అనే నెటిజన్ ఆ ఉద్యోగి స్టోరీని నెట్టింట పంచుకున్నాడు. అతడు తెలిపిన వివరాల ప్రకారం, ఆ ఉద్యోగికి ఏటా రూ.43 లక్షల శాలరీ. అయినా అతడు కంపెనీ మారేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే, అతడు జాబ్ మారాలనుకుంటోంది ప్రమోషన్ కోసమో లేదా శాలరీ పెంపు కోసమే కాదు, ఆహారం కోసం. యస్.. రోజుకు నాలుగు పూటలా ఉచితంగా భోజనం పెట్టే కంపెనీ కోసం తను ప్రయత్నం చేస్తున్నట్టు అతడు చెప్పాడు.

Viral: ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!

మద్యం సేవించేటప్పుడు అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే!


తను రెగ్యులర్‌గా జిమ్ చేస్తానని, మంచి పోష్టికాహారం తీసుకుంటానని చెప్పాడు. తన ఫుడ్ ఖర్చు బాగా ఎక్కువ కాబట్టి నాలుగు పూటలా పౌష్టికాహారం పెట్టే జాబ్ కోసం ట్రై చేస్తున్నానని తెలిపాడు. తనకు తెలిసి గూగుల్‌లో ఇలాంటి ఫుడ్ ఉంటుందని, కాబట్టి గూగుల్ ఇంటర్వ్యూలకు కూడా రెడీ అవుతున్నానని చెప్పాడు. ఇలాంటి కంపెనీలు ఇంకేమైనా ఉంటే చెప్పాలంటూ నెటిజన్లను అభ్యర్థించాడు (Man With rs 43 Lakh Package Seeks Companies With Free Food).

Viral: బాస్‌కు ఊహించని షాకిచ్చిన ఉద్యోగి.. ఒక్క మెసేజ్‌తోనే కథ ఫినిష్..!

ఇదంతా విన్న నెటిజన్లు షాకైపోతున్నారు. ఆ ఉద్యోగికి తన జీవితంపై ఉన్న క్లారిటీ కొందరు నెటిజన్లకు తెగ నచ్చేసింది. తనకేం కావాలో ఏం వద్దో అతడికి కరెక్ట్‌గా తెలుసంటూ కామెంట్ చేశారు. కొందరికి మాత్రం ఆ ఉద్యోగి శాలరీ చూసి దిమ్మతిరిగినంత పనైంది. ఏటా రూ.43 లక్షల సీటీసీ తీసుకుంటూ నెలకు ఫుడ్ కోసం రూ.10 వేలు ఖర్చు పెట్టలేడా అంటూ జనాలు ఎద్దేవా చేశారు. పిసినారి తనానికి పరాకాష్ఠ అంటే ఇదే అంటూ విమర్శలు గుప్పించారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2024 | 08:33 PM