Share News

Viral: ఛి ఛీ.. బాత్రూమ్‌లో అతడి డర్టీ పని చూసి మహిళకు షాక్.. అసలేం జరిగిందో తెలిస్తే..

ABN , Publish Date - Feb 17 , 2024 | 05:46 PM

కొత్తగా ఉద్యోగంలో చేరిన సంబరం అతడికి కొన్ని గంటల పాటు కూడా మిగల్లేదు. బాత్రూమ్‌లో అతడు చేసిన పని చూసిన ఓ మహిళ బాస్‌కు ఫిర్యాదు చేయడంతో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.

Viral: ఛి ఛీ.. బాత్రూమ్‌లో అతడి డర్టీ పని చూసి మహిళకు షాక్.. అసలేం జరిగిందో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: కొత్తగా ఉద్యోగంలో చేరిన సంబరం అతడికి కొన్ని గంటల పాటు కూడా మిగల్లేదు. బాత్రూమ్‌లో అతడు చేసిన పని చూసిన ఓ మహిళ బాస్‌కు ఫిర్యాదు చేయడంతో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఈ షాక్‌ను తేరుకోలేకపోతున్న బాధితుడు తన ఆవేదనను నెట్టింట పంచుకున్నాడు. ప్రముఖ చర్చా వేదిక రెడిట్‌లో అతడు చెప్పిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అతడు అంత బాధలో ఉన్నా నెటిజన్లు మాత్రం అతడినే తిట్టిపోస్తున్నారు.

Viral: ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!

మద్యం సేవించేటప్పుడు అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే!


తన పేరు ఇతర వివరాలను బాధితుడు గోప్యంగా ఉంచడంతో ఘటన ఎక్కడ జరిగిందీ తెలియలేదు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం, ఇటీవలే అతడికి కొత్త జాబ్ వచ్చింది. దీంతో, తెగ మురిసిపోయిన అతడు జాబ్‌లో జాయిన్ అయ్యే ముందు రోజు ఫ్రెండ్స్‌తో కలిసి తెగ ఎంజాయ్ చేశాడు. ఫుల్లగా తాగాడు.. నచ్చిన ఫుడ్స్‌ మొహమాటం లేకుండా లాగించేశాడు. ఇక మరుసటి టైంకు ఆఫీసుకు వెళ్లిన అతడు కొత్త బాధ్యతలకు సంబంధించి లాంఛనాలు పూర్తి చేయసాగాడు. ఈ క్రమంలో, కాలకృత్యం కోసం బాత్‌రూంకు వెళ్లిన అతడు టాయిటెల్ పేపర్‌ను దండిగా వాడి కమ్మోడ్‌లో పడేశాడు. కొత్త జాబ్ కావడంతో కంగారులో ఉన్న అతడు కమ్మోడ్ సరిగా ఫ్లష్ చేయకుండానే బయటకు వచ్చేశాడు (Man Loses His Job On The Very First Day For This Dirty Etiquette).

ఈ ఫుడ్స్ చేపలకంటే చాలా బెటర్! ఎందుకో తెలిస్తే..


అతడు బయటకు వచ్చిన వెంటనే వెళ్లిన మహిళ అక్కడి దృశ్యం చూసి షాక్ తింది. కమ్మోడ్‌లో టాయ్‌లెట్ పేపర్ ఇరుక్కుపోవడంతో నీళ్లు సరిగ్గా పోలేదు. ఆమె పలుమార్లు ఫ్లష్ చేసినా ఉపయోగం లేకపోయింది. దీంతో ఆమె తిక్కరేగి బాస్‌కు ఫిర్యాదు చేసింది. అప్పటికి పంబర్ కూడా అందుబాటులో లేకపోవడంతో మీరే ఏదైనా చేయండని బాస్‌ ఆమెకు చెప్పి పంపించేశాడు. ఆ తరువాత బాస్ అతడితో మరో మాట మాట్లాడకుండా ఇంటికి పంపించేశాడు. మరుసటి రోజు కూడా ఆఫీసు నుంచి ఎటువంటి కాల్ రాకపోవడంతో అతడికి తన జాబ్ పోయినట్టు అర్థమై కంగుతిన్నాడు. తను కంగారులో ఉన్న కారణంగానే ఇలా జరిగింది తప్ప మరో ఉద్దేశం ఏదీ లేదంటూ అతడు నెట్టింట వాపోయాడు. కానీ జనాలు మాత్రం అతడిని కనికరించలేదు. బాత్రూమ్ మ్యానర్స్ విషయంలో క్షమించే ప్రసక్తే లేదని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: అతడి జీవితం నాశనం చేసిన ప్రభుత్వంలో పశ్చాత్తాపం! ఏకంగా రూ.116 కోట్ల పరిహారం! జరిగిందేంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2024 | 06:04 PM