Share News

Viral: పొరపాటున ఖైదీని విడుదల చేసిన జైలు అధికారులు.. బయటకొచ్చిన అతడు ఏం చేశాడో తెలిస్తే..

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:43 PM

తనను పొరపాటున విడుదల చేశారని గుర్తించిన ఓ ఖైదీ స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: పొరపాటున ఖైదీని విడుదల చేసిన జైలు అధికారులు.. బయటకొచ్చిన అతడు ఏం చేశాడో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఓ ఖైదీని పొరపాటున విడుదల చేసిందుకు భయపడిపోయిన జైలు అధికారులకు చివరకు ఊహించని సర్‌ప్రైజ్ లభించింది. పొరపాటును గుర్తించిన ఖైదీ తన నిజాయతీని చాటుకుంటూ తానే స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆస్ట్రేలియాలో (Australia) వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (viral) మారింది. కోరీ హేస్టింగ్స్ అనే వ్యక్తి సిడ్నీలోని (Sydney) లాంగ్ బే కరెక్షనల్ కాంప్లెక్స్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. గత గురువారం అతడి బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా అతడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యాడు. అయితే, అతడి బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కానీ, రికార్డుల్లో మాత్రం అతడికి బెయిల్ మంజూరైనట్టు తప్పుగా నమోదైంది.

Viral: కిడ్నీ అమ్ముదామనుకున్న చార్టర్డ్ అకౌంటెంట్.. ఒక కిడ్నీకి రూ.2 కోట్లు వస్తాయని తెలిసి..


ఈ క్రమంలో జైలు అధికారులు అదే రోజు అతడిని విడుదల చేశారు. ఆ తరువాత.. జరిగిన పొరపాటు గుర్తించి లబోదిబోమన్నారు. కోరీ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అతడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో బయలుదేరినట్టు, స్థానిక షాపింగ్ సెంటర్లో ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు, ఈ ఉదంతం వార్తా ఛానళ్లలో కూడా విస్తృతంగా ప్రసారమైంది (Australian Prisoner Accidentally Released From Jail, surrenders).

Viral: 50 ఏళ్లుగా కోకోకోలా తప్ప చుక్క నీరు కూడా తాగలేదు.. చివరకు ఇతడి పరిస్థితి ఏమైందో తెలిస్తే..


అయితే, ఓ హోటల్‌లో ఉంటున్న కోరీకి శుక్రవారం నాడు.. పొరపాటు గురించి వార్తాఛానళ్ల ద్వారా తెలిసింది. దీంతో, వెంటనే అతడు పోలీసులను సంప్రదించాడు. తాను ఎక్కడ ఉన్నాదీ వారికి చెప్పి, వచ్చి తీసుకెళ్లమన్నాడు. కోరి స్వయంగా కాల్ చేసి లొంగిపోతాననడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం, అతడిని మళ్లీ జైలుకు తరలించారు.

ఇక, ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు అక్కడి జైళ్ల శాఖ విచారణకు ఆదేశించింది. మరోవైపు, ఈ ఉదంతం నెట్టింట కూడా వైరల్‌ కావడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఖైదీ నిజాయతీని వేనోళ్ల పొడుగుతున్నారు.

Viral: ఫుల్‌గా ఎంజాయ్ చేద్దామని రైల్లో విండో సీట్ బుక్ చేసుకుంటే షాక్.. చివరకు ఊహించని విధంగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 04:48 PM