Share News

Viral: కిడ్నీ అమ్ముదామనుకున్న చార్టర్డ్ అకౌంటెంట్.. ఒక కిడ్నీకి రూ.2 కోట్లు వస్తాయని తెలిసి..

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:40 PM

ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు కిడ్నీ అమ్ముదామనుకున్న ఓ చార్టర్డ్ అకౌంట్‌‌కు భారీ షాక్

Viral: కిడ్నీ అమ్ముదామనుకున్న చార్టర్డ్ అకౌంటెంట్.. ఒక కిడ్నీకి రూ.2 కోట్లు వస్తాయని తెలిసి..

ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) తన కిడ్నీ అమ్ముదామనుకున్నాడు. ఒక్క కిడ్నీకి రూ.2 కోట్లు వస్తుందన్న ఆఫర్ చూసి తన కష్టాలన్నీ తీరిపోయినట్టే అని భావించాడు. చివరకు ఘోరంగా మోసపోయాడు.

బెంగళూరుకు (Bengaluru) చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఇటీవల పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాడు. కారు ఈఎమ్ఐలు చెల్లించలేక చిక్కుల్లో పడ్డాడు. ఆర్థిక కష్టాల నుంచి బయట పడేందుకు తన కిడ్నీని అమ్మాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో సెర్చ్ ప్రారంభించగా అతడికి ఏదో వెబ్‌సైట్ కనిపించింది. అందులోని నెంబర్‌కు ఫోన్ చేసి తాను కిడ్నీ అమ్మాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో అవతలి వ్యక్తి చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి అతడి పేరు, అడ్రస్, వయసు బ్లడ్ గ్రూప్ వంటి వివరాలు తీసుకున్నాడు. ఆ తరువాత ఒక కిడ్నీకి రూ.2 కోట్లు ఇస్తామని చెప్పాడు. ముందుగా రూ. కోటి అడ్వాన్స్ ఇస్తామని కూడా చెప్పాడు (Scam). ఇదంతా నిజమని నమ్మిన చార్టర్డ్ అకౌంటెంట్ కిడ్నీ దానానికి రెడీ అయిపోయాడు.

Viral: 50 ఏళ్లుగా కోకోకోలా తప్ప చుక్క నీరు కూడా తాగలేదు.. చివరకు ఇతడి పరిస్థితి ఏమైందో తెలిస్తే..


ఈ క్రమంలో నిందితులు తొలుత చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి ఆధార్, పాన్ కార్డు, ఈమెయిల్ ఐడీ తదితర వివరాలు తీసుకున్నారు. కిడ్నీ దానానికి ఎన్ఓసీ కావాలంటూ బాధితుడి నుంచి తొలుత రూ.8 వేలు పుచ్చుకున్నారు. ఆ తరువాత పర్ఛేజ్ కోడ్ పేరిట మరో రూ.20 వేలు నొక్కేశారు. కోడ్ ఆపరేట్ చేసేందుకు మరో రూ.85 వేలు అతడి నుంచి లాగేసుకున్నారు. ఇక రూ. కోటి అడ్వాన్స్ చెల్లించేందుకు టాక్స్ క్లియరెన్స్ కింద మరో రూ.5 లక్షలు అతడి నుంచి తీసుకున్నాడు. ఆ తరువాత మరో మహిళ తాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగినంటూ అతడికి కాల్ చేసింది. యాంటీ డ్రగ్, టెర్రరిస్టు క్లియరెన్స్ తెచ్చుకునేందుకు మరో రూ 7.6 లక్షలు చెల్లించాలని అడిగింది (Bengaluru CA Willing To Sell Kidney To Pay Off Debt Gets Duped).

Viral: ఫుల్‌గా ఎంజాయ్ చేద్దామని రైల్లో విండో సీట్ బుక్ చేసుకుంటే షాక్.. చివరకు ఊహించని విధంగా..


ఇలా రకరకాల కారణాలతో తన నుంచి డబ్బు తీసుకుంటుండటంతో బాధితుడికి అనుమానం మొదలై తన బాస్‌తో పాటు మిత్రులను వాకబు చేశాడు. తాను మోసపోయినట్టు వారు చెప్పడంతో అతడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులపై ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. నిందితులు అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేయించారు. నిందితుల కోసం ప్రస్తుతం విస్తృతంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇలా కిడ్నీ అమ్మకానికి పెట్టడం చట్టవిరుద్ధమని తనకు తెలీదంటూ బాధితుడు వాపోయాడు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 03:58 PM