Share News

Viral: ఫుల్‌గా ఎంజాయ్ చేద్దామని రైల్లో విండో సీట్ బుక్ చేసుకుంటే.. చివరకు ఊహించని విధంగా..

ABN , Publish Date - Mar 10 , 2024 | 08:51 PM

అద్భుత ప్రయాణానుభవం కోసం రైల్లో విండో టిక్కెట్ బుక్ చేసుకున్న ఓ ప్రయాణికుడికి ఊహించని షాక్

Viral: ఫుల్‌గా ఎంజాయ్ చేద్దామని రైల్లో విండో సీట్ బుక్ చేసుకుంటే.. చివరకు ఊహించని విధంగా..

ఇంటర్నెట్ డెస్క్: ప్రయాణా సాధనాలన్నిటిలోకి రైలే బెస్ట్ అని చెప్పకతప్పదు. ఇక విండో పక్కన సీటు దొరికిందంటే జీవితాంతం గుర్తుండిపోయే మధురస్మృతులు పోగేసుకోవచ్చు. ఇలాంటి అనుభవం కోసం అనేక మంది విండో పక్క సీటునే బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా సరిగ్గా ఇలాంటి ప్రయత్నమే చేశాడు. రైల్లో విండో సీట్ (Window Seat) కన్ఫార్మ్ అయినందుకు సంబరపడిపోయిన అతడికి రైలు ఎక్కగానే దిమ్మతిరిగినంత పనైంది. అసలేం జరిగిందో వివరిస్తూ అతడు పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..

చైర్ కార్ బోగీలో తాను విండో పక్కన సీటు బుక్ చేసుకున్నట్టు అతడు చెప్పుకొచ్చాడు. తీరా రైలు ఎక్కేసరికి తన సీటు (Window Less Seat) రెండు కిటికీల మధ్య ఉందని వివరించాడు. ఆ సీన్ చూసేసరికి తన ఉత్సాహమంతా క్షణంలో నీరు కారిపోయిందన్నాడు. తన సీటు ఫొటోను కూడా నెట్టింట షేర్ చేశాడు.

Viral: 50 ఏళ్లుగా కోకోకోలా తప్ప చుక్క నీరు కూడా తాగలేదు.. చివరకు ఇతడి పరిస్థితి ఏమైందో తెలిస్తే..


ఇదంతా చూసీన నెటిజన్లు పడీపడీ నవ్వుకున్నారు. ఇలాంటి అనుభవాలు తమకూ అనేకం ఉన్నాయని కొందరు చెబ్బుకొచ్చారు. నా జాతకానికి ఈ ఫొటో అద్దం పడుతోందని ఓ వ్యక్తి సరదా వ్యాఖ్య చేశాడు. కిటికీని ఎవరైనా ఎత్తుకెళ్లిపోయి ఉండొచ్చు, భారత రైళ్లల్లో (Indian Railways) ఇలాంటివి సాధారణమే అని మరో వ్యక్తి సెటైర్ వేశాడు. జనాల్ని ప్రస్తుతం తెగ ఎంటర్‌టైన్ చేస్తున్న ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Viral: మాటు వేసి వేటాడే చిరుతనే బురిడీ కొట్టించిన బాలుడు.. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాన్ని చూస్తే..

అయితే, రైల్వేల్లోనే కాకుండా విమానాల్లోనూ ఇలాంటి పలు ఘటనలు గతంలో వెలుగుచూశాయి. కొంతకాలం క్రితం అధికధర చెల్లించి మరీ విండో సీట్ బుక్ చేసుకున్న ఓ మహిళకు చివరకు నిరాశేమిగిలింది. ఈ క్రమంలో ఆమె తన ఆవేదన అంతా నెట్టింట వెళ్లబోసుకుంది. కిటికీ పక్కన సీటులో కూర్చుని మేఘాల్ని చూడచ్చనుకున్న తన ఆశలన్నీ వమ్మైపోయాయని ఆమె వాపోయింది. అప్పటి ఈ ఉదంతంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2024 | 08:55 PM