Share News

Wedding: అనుకోని అతిథులుగా తేనెటీగల ఎంట్రీ.. పెళ్లిమండపంలో షాకింగ్ దృశ్యాలు!

ABN , Publish Date - Feb 18 , 2024 | 03:18 PM

ఓ పెళ్లికి అనుకోని అతిథులుగా ఎంట్రీ ఇచ్చిన తేనెటీగలు అల్లకల్లోలం సృష్టించడంతో 12 మంది గాయాలపాలయ్యారు. మధ్యప్రదేశ్‌‌లో ఈ దారుణం వెలుగు చూసింది.

Wedding: అనుకోని అతిథులుగా తేనెటీగల ఎంట్రీ.. పెళ్లిమండపంలో షాకింగ్ దృశ్యాలు!

ఇంటర్నెట్ డెస్క్: ఓ వివాహంలో అనుకోని అతిథులుగా ఎంట్రీ ఇచ్చిన తేనెటీగలు అల్లకల్లోలం సృష్టించాయి. దీంతో, ఏకంగా 12 మంది గాయాల పాలయ్యారు. మధ్యప్రదేశ్‌లో (Madhyapradesh) గుణ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం, స్థానిక కస్తూరీ గార్డెన్ హోటల్‌లో వివాహ వేడుక జరగుతోంది. అయితే, ఆ హోటల్ టాపుపై తేనె తుట్టె కూడా ఉంది. హోటల్‌ అంతా కోలాహలంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా తేనెటీగల గుంపు అక్కడున్న వారిపై దాడికి దిగింది. అవి ఇష్టారీతిన కుట్టడం మొదలెట్టడంతో అతిథులు బాధ తాళలేక చెల్లాచెదురైపోయారు.

మినరల్ వాటర్ తాగుతారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు

ఛి ఛీ.. బాత్రూమ్‌లో అతడి డర్టీ పని చూసి మహిళకు షాక్.. అసలేం జరిగిందో తెలిస్తే..


ఈ ఘటనలో దాదాపు 12 మందికి గాయపడ్డారు. కొందిరికి తీవ్ర గాయాలు అయ్యాయి. తేనెటీగల నుంచి తప్పించుకునే క్రమంలో అతిథులు పెద్దపెట్టున కేకలు పెడుతూ పరుగులు తీయడంతో ఆ ప్రాంతమంతా భీతావాహ వాతావరణం నెలకొంది (Hive Of Bees Turn Up Uninvited At Madhya Pradesh Wedding).

విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక అధికారులు, ఎమర్జెన్సీ సిబ్బంది బాధితులకు ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రగాయాల పాలైన వారిని ఆసుపత్రులకు తరలించారు.

Viral: ఛి ఛీ.. బాత్రూమ్‌లో అతడి డర్టీ పని చూసి మహిళకు షాక్.. అసలేం జరిగిందో తెలిస్తే..

ఇదిలా ఉంటే, హోటల్ రూఫ్‌పై తేనెతుట్టెలు ఎప్పటినుంచో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హోటల్ యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో, ఈ ఘటనలో యాజమాన్యం పాత్ర ఎంత ఉందో తేల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తేనెటీగల విషయంలో ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

Viral: రాత్రంతా కారు కిటికీ తెరిచే ఉంచాడు.. మరుసటి రోజు కారులో ఏసీ ఆన్ చేస్తే భారీ షాక్!

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 18 , 2024 | 03:21 PM