Share News

Watch Video: అమ్మాయికి మెసేజ్.. నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్న పోరగాళ్లు..!

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:30 PM

Viral Video: ప్రస్తుత కాలంలో కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. ఖండాలు దాటి వివిధ దేశాల్లో ఉన్న వ్యక్తులకు సైతం సెకన్ల వ్యవధిలో కాంటాక్ట్ అవగలుగుతున్నాయి. ఏదైనా చెప్పాలనుకుంటే ఎదుటి వారికి ఒక టెక్ట్స్ మెసేజ్ పంపిస్తాం.. మరీ అవసరం అయితే కాల్ చేసి మాట్లాడుతాం. అయితే, కమ్యూనికేషన్ సిస్టమ్‌తో ఎంత ప్రయోజనం ఉందో.. కొన్ని కొన్నిసార్లు ఏమరపాటు కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Watch Video: అమ్మాయికి మెసేజ్.. నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్న పోరగాళ్లు..!
Viral Video

Viral Video: ప్రస్తుత కాలంలో కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. ఖండాలు దాటి వివిధ దేశాల్లో ఉన్న వ్యక్తులకు సైతం సెకన్ల వ్యవధిలో కాంటాక్ట్ అవగలుగుతున్నాయి. ఏదైనా చెప్పాలనుకుంటే ఎదుటి వారికి ఒక టెక్ట్స్ మెసేజ్ పంపిస్తాం.. మరీ అవసరం అయితే కాల్ చేసి మాట్లాడుతాం. అయితే, కమ్యూనికేషన్ సిస్టమ్‌తో ఎంత ప్రయోజనం ఉందో.. కొన్ని కొన్నిసార్లు ఏమరపాటు కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా ఓ అబ్బాయి ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఆ ఇష్యూ కాస్తా రెండు గ్రూప్స్ మధ్య వివాదంగా మారి.. నడిరోడ్డుపై తన్నుకునే పరిస్థితికి దారింది.

పొరపాటున ఓ అమ్మాయికి వెళ్లిన మెసేజ్ కారణంగా కొందరు అబ్బాయిలు రెండు గ్రూపులుగా చేరి నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్నారు. వీరంతా కొట్టుకుంటుండగా.. పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ సైతం లైట్ తీసుకున్నాడు. కాసేపటి తరువాత వారందరినీ కొడుతూ అక్కడి నుంచి తరిమేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో రెండు గ్రూపులుగా ఉన్న కొందరు అబ్బాయిలు.. నాలుగు రోడ్ల కూడలి వద్దకు వచ్చి ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అయితే, వీరికి గొడవకు కారణం.. ఈ గ్రూప్‌లో ఒక అబ్బాయి పొరపాటున ఒక అమ్మాయికి మెసేజ్ పంపాడట. అది కూడా పొరపాటుగానే వెళ్లిందట. ఆ విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. రోడ్డు మీద నుంచి వెళ్లే కొందరు వారిని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ పక్కనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నప్పటికీ మొదట పట్టించుకోలేదు. కానీ, ట్రాఫిక్‌కు అంతరాయం అవుతుండటంతో చివరకు వారిని బెదిరించి పక్కకు తరిమేశాడు. అయితే, ఇది ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే వివరాలేవి లేవు కానీ.. ఇటీవలే జరిగినట్లు నెటిజన్లు తమ తమ కామెంట్స్‌లో చెబుతున్నారు.

ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ అకౌంట్ ‘Ghar Ke Kalesh’ ఐడీలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు వీరి చర్యను తప్పుపట్టగా.. మరికొందరు ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు. ‘ఇద్దరు కొట్టుకుంటే.. మూడో వ్యక్తి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు’ అని ఒకరు కామెంట్స్ పెట్టారు. ‘అబ్బాయిలూ.. అమ్మాయిలకు టెక్ట్స్ చేయకండి’ అని మరొకరు.. ‘ఈ కొట్లాట ఇంకాసేపు జరిగితే బాగుండేది. మస్త్ మజా వచ్చింది. చుట్టూ ఉన్న జనాలు అనవసరంగా ఆపేశారు.’ అని ఇంకొకరు కామెంట్స్ చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 04:30 PM