Share News

Viral: లోకంలో నిజమైన ప్రేమే లేదా? గర్ల్‌ఫ్రెండ్‌కు మైక్రోసాఫ్ట్‌లో జాబ్ వచ్చేలా చేస్తే.. ఆమె దారుణంగా..

ABN , Publish Date - Feb 18 , 2024 | 06:43 PM

గర్ల్‌ఫ్రెండ్ కెరీర్‌లో ముందుకెళ్లేందుకు అనేక రకాలుగా సాయపడ్డ ఓ వ్యక్తి చివరకు ఆమె చేసింది తెలిసి తట్టుకోలేక బోరుమన్నాడు.

Viral: లోకంలో నిజమైన ప్రేమే లేదా? గర్ల్‌ఫ్రెండ్‌కు మైక్రోసాఫ్ట్‌లో జాబ్ వచ్చేలా చేస్తే.. ఆమె దారుణంగా..

ఇంటర్నెట్ డెస్క్: గర్ల్‌ఫ్రెండ్ కెరీర్‌లో ముందుకెళ్లేందుకు అనేక రకాలుగా సాయపడ్డ ఓ వ్యక్తి చివరకు ఆమె చేసింది తెలిసి తట్టుకోలేక బోరుమన్నాడు. తన గోడును ఫ్రెండ్‌ ముందు వెళ్లబోసుకున్నాడు. వారిద్దరి సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్‌‌గా (Viral) మారింది. ప్రేమ, పెళ్లి వంటి కీలక విషయాలపై పెద్ద చర్చ మొదలయ్యింది.

Viral: ఓనర్ ఆంటీ నుంచి కుర్రాడికి ఊహించని మెసేజ్..నన్ను కన్నకొడుకులా చూస్తుంది.. ఇప్పుడేం చేయాలంటూ..

తొలుత ఓ వ్యక్తి తన ఫ్రెండ్‌ను వాలంటైన్స్ డే ప్రోగ్రామ్స్ ఏమీ లేవా అని ప్రశ్నించాడు. దీంతో, ఆ భగ్నప్రేమికుడు తన గోడునంతా వెళ్లబోసుకున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌కు మైక్రోసాఫ్ట్‌లో జాబ్ వచ్చేందుకు తాను ఎంతో కష్టపడ్డానని అతడు చెప్పాడు. ఆమె రెజ్యూమే కూడా తనే ప్రిపేర్ చేసినట్టు వివరించాడు. ఇంటర్వ్యూకు సిద్ధమయ్యే సమయంలోనూ సాయపడ్డానన్నాడు (Girl dumps boyfriend after getting job in Microsoft goes on date with colleague).

మినరల్ వాటర్ తాగుతారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు


ఆమెకు కోరుకున్న జాబ్ వచ్చాక తనను దారుణంగా మోసం చేసిందని చెప్పాడు. మైక్రోసాఫ్ట్‌లో తన కొలీగ్‌తో డేటింగ్ మొదలెట్టిందని తెలిపాడు. తనకు మాత్రం ఇంకా జాబ్ రాలేదని వాపోయాడు. కాబట్టి, జీవితంలో ప్రేమ దోమ అంటూ మోసపోవద్దని, సింగిల్‌గానే ఉండాలని తన ఫ్రెండ్‌కు సలహా ఇచ్చాడు.

Viral: ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!

ఈ చాట్ తాలూకు స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారింది. అనేక మంది ఆ యువకుడి పరిస్థితికి జాలి పడ్డారు. ఈ కాలంలో నిజమైన ప్రేమలంటూ ఏవీ లేవని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మరింత మెరుగైన అవకాశాల కోసం పరుగులు పెడుతున్నారని తేల్చి చెప్పారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 18 , 2024 | 06:47 PM