Share News

Elon musk: స్నేహితుడి కాపురాన్ని కూల్చిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్?

ABN , Publish Date - May 25 , 2024 | 08:27 PM

గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్యకు మస్క్ దగ్గరవడం నిజమేనని న్యూయార్క్ టైమ్స్ మరో సంచలన కథనం ప్రచురించింది. ఆ తరువాత సెర్గీ తన భార్యకు విడాకులిచ్చాడని విశ్వసనీయ వర్గాలను ఊటంకిస్తూ సంచలన కథనాన్ని ప్రచురించింది.

Elon musk: స్నేహితుడి కాపురాన్ని కూల్చిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్?

ఇంటర్నెట్ డెస్క్: ఇన్నాళ్లుగా సద్దుమణిగిందనుకుంటున్న ఉదంతం మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన కథనంతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon musk) ఎఫైర్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. గూగుల్ సహ వ్యవస్థాపకుడు, మస్క్ స్నేహితుడైన సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షానహాన్ తో ఆయనకు సంబంధం ఉందని కొంత కాలం క్రితం ఓ వార్త వైరల్ (Viral) అయిన విషయం తెలిసిందే. అప్పట్లో దీన్ని మస్క్ తో పాటు సెర్గీ భార్య నికోల్ షానహాన్ కూడా ఖండించారు.

అయితే, న్యూయార్క్ టైమ్స్ తాజాగా వీరి ఎఫైర్ నిజమేనంటూ ఓ సంచలన కథానాన్ని ప్రచురించింది. ఈ ఎఫైర్ తరువాతే సెర్గీ బ్రిన్, నికోల్ విడాకులు తీసుకున్నారని కూడా చెప్పింది. ఓ పార్టీలో వీరి మధ్య సంబంధం ఏర్పడని విషయాన్ని కొందరు తమకు విశ్వసనీయ సమాచారం అందించారని పేర్కొంది. ఈ కథనం ప్రకారం, 2021లో న్యూయార్క్ లో నికోల్ ఓ బర్త్ డే పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు మస్క్ కూడా హాజరయ్యాడు. ఆ తరువత మస్క్ సోదరుడు ఏర్పాటు చేసిన పార్టీలో వీరు ఒకరికొకరు తారసపడ్డారు. ఆ సందర్భంగా ఇద్దరూ కీటమైన్ అనే డ్రగ్ తీసుకున్నారు.

Viral: వామ్మో ఇదేం దారుణం! కదులుతున్న లారీలో ప్రమాదకరంగా చోరీ..


ఆ తరువాత పార్టీ నుంచి ఇద్దరూ నిష్క్రమించారు. కొన్ని గంటల తరువాత ఇద్దరూ మళ్లీ పార్టీలో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగానే తాను మస్క్ కు దగ్గరైనట్టు నికోల్ తన భర్త సెర్గీ బ్రిన్ కు చెప్పినట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలను ఊటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులు, కుటుంబ సభ్యుల ముందు కూడా అంగీకరించిందట. అయితే, ఈ ఎఫైర్ ఆరోపణలు అవాస్తవమని గతేడాదే నికోల్ స్పష్టం చేసింది. తాను అప్పుడు మస్క్ తో కేవలం తన బిడ్డ చికిత్స గురించే మాట్లాడానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే, ఆ పార్టీ తరువాత సెర్గీ, షానహాన్ ఇద్దరూ వేరుపడ్డారు. చివరకు 2022లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత 18 నెలలకు వీరికి విడాకులు మంజూరయ్యాయి.

Read Viral and Telugu News

Updated Date - May 25 , 2024 | 08:39 PM