Share News

Viral: వామ్మో ఇదేం దారుణం! కదులుతున్న లారీలో ప్రమాదకరంగా చోరీ..

ABN , Publish Date - May 25 , 2024 | 03:40 PM

హాలీవుడ్ సినిమాలను గుర్తుకు తెచ్చేలా మధ్యప్రదేశ్‌లో దొంగలు రెచ్చిపోయారు. కదులుతున్న లారీ లోంచి లోడ్ ముగ్గురు దొంగుల ఈజీగా దోచేశారు. అత్యంత ప్రమాదకర తీరులో జరిగిన ఈ దొంగతనం ప్రస్తుతం నెటిజన్లను షేక్ చేస్తోంది.

Viral: వామ్మో ఇదేం దారుణం! కదులుతున్న లారీలో ప్రమాదకరంగా చోరీ..

ఇంటర్నెట్ డెస్క్: హాలీవుడ్ సినిమాలను గుర్తుకు తెచ్చేలా మధ్యప్రదేశ్‌లో దొంగలు రెచ్చిపోయారు. కదులుతున్న లారీపైకి ఎక్కిమరీ ముగ్గురు దొంగుల లోడ్‌ను దోచేశారు. అత్యంత ప్రమాదకర తీరులో జరిగిన ఈ దొంగతనం ప్రస్తుతం నెటిజన్లను షేక్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా (Viral) మారింది. దొంగలు మరీ ఇంతలా రెచ్చిపోయారేంటో అనుకుని అనేక మంది నోరెళ్లబెట్టారు.

షాజాపూర్ జిల్లాలో ఆగ్రా-ముంబై హైవేపై ఈ చోరీ జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ముగ్గురు దొంగలు వేగంగా వెళుతున్న ట్రక్కులో చోరీకి తెగబడతారు. ఒకరు బైక్‌ పై లారీని ఫాలో అవుతుంటే మరో ఇద్దరు జాగ్రత్తగా లారీ ఎక్కారు. ఆ తరువాత అందులోంచి ఓ ప్యాకెట్ కిందకు విసిరేశారు. అనంతరం జాగ్రత్తగా ఇద్దరు దొంగలు ఒకరితరువాత ఒకరు బైక్‌పై జాగ్రత్తగా దిగి కూర్చున్నారు. వారి వెనకాలే వస్తున్న మరో ప్రయాణికుడు ఈ షాకింగ్ దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయారు. నమ్మశక్యం కానీ దీన్ని జనాలకు చూపించేందుకు వీడియో తీశాడు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది (Thieves On Bike Steal Goods From Moving Truck On Agra Mumbai Highway).

Viral: ఏ తండ్రికీ రాకూడని కష్టం.. కూతురి ముందు అవమానంతో మోకరిల్లి కన్నీటిపర్యంతం!


వీడియో చూసిన అనేక మంది దొంగలు ప్రాణాలకు తెగించి మరీ చోరీ చేశారని అభిప్రాయపడ్డారు. లారీ డ్రైవర్ గనక సడెన్ బ్రేకు వేసుంటే వెనకాలే ఉన్న బైక్ లారీని వేగంగా ఢీకొనేదని, దీంతో, బైక్ నడుపుతున్న దొంగ అక్కడిక్కడే మరణించేవాడని అన్నారు. మరికొందరు మాత్రం ఈ చోరీలో లారీ డ్రైవర్ పాత్ర కూడా ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, వారు ఏ వస్తువులు చోరీ చేశారనేది మాత్రం తెలియరాలేదు.

మహారాష్ట్రలో గతేడాది మేలో ఇలాంటి భయానక చోరీ ఉదంతం వెలుగు చూసింది. ఓ వ్యక్తి ట్రక్కులో తరలిస్తున్న మేకలను దారుణ రీతిలో దొంగిలించాడు. ఒక్కో మేకను కదులుతున్న ట్రక్కులోంచి కింద పడేయడంతో అవి తీవ్ర గాయాలపాలయ్యాయి. ఈ క్రూర చర్యకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Viral and Telugu News

Updated Date - May 25 , 2024 | 03:45 PM