Share News

British Couple's Lottery Win: బాయ్‌ఫ్రెండ్ డబ్బుతో లాటరీ గెలిచిన మహిళ చివరకు అతడికి ఎలాంటి షాకిచ్చిందంటే..

ABN , Publish Date - Feb 22 , 2024 | 06:53 PM

బ్రిటన్‌కు చెందిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు భారీ షాకిచ్చింది. అతడి డబ్బుతో లాటరీ గెలిచిన ఆమె ఆ డబ్బును అతడితో పంచుకునేది లేదని తెగేసి చెప్పింది

British Couple's Lottery Win: బాయ్‌ఫ్రెండ్ డబ్బుతో లాటరీ గెలిచిన మహిళ చివరకు అతడికి ఎలాంటి షాకిచ్చిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌కు(Britain) చెందిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు భారీ షాకిచ్చింది. అతడి డబ్బుతో లాటరీ (Lottery) గెలిచిన ఆమె ఆ డబ్బును అతడితో పంచుకునేది లేదని తెగేసి చెప్పింది. చివరకు అతడు కోర్టును ఆశ్రయించినా ఉపయోగం లేకపోయింది.

Viral: స్కూల్లో ఫ్రెండ్‌కు కొన్నేళ్ల పాటు హోం వర్క్ చేసిచ్చిన బాలిక.. పెద్దయ్యాక అతడిచ్చిన గిఫ్ట్ చూసి..

పూర్తి వివరాల్లోకి వెళితే, మైఖేల్ కార్టలిడ్జ్ (39), అతడి గ్లర్‌ఫ్రెండ్‌ షార్లెట్ కాక్స్ (37) మూడు నెలలుగా డేటింగ్‌లో ఉన్నారు. కానీ లాటరీతో వచ్చిన డబ్బు వారి బంధాన్ని ఒక్కసారిగా తెంచేసింది. మైఖేల్ చెప్పిన వివరాల ప్రకారం, ఇటీవల ఓ రోజు కాక్స్ ఓ షాపులో లాటరీ కొనేసమయంలో తన వద్ద డబ్బు లేని విషయం గుర్తించింది. దీంతో, అతడిని డబ్బులు అడిగింది. అతడు తన ఫోన్‌లోని యాప్ ద్వారా ఆ డబ్బును బట్వాడా చేశాడు. ఆ తరువాత ఆమె తన పేరు మీద రెండు టిక్కెట్లు కొనుక్కుంది.

Indian Railways: రైల్లో ఒంటరిగా వెళుతున్న యువతి..తానున్న బోగీలో దృశ్యాన్ని అక్కకు వాట్సాప్‌లో షేర్ చేయడంతో..


ఇద్దరూ ఇంటికి వెళ్లాక ఆ టికెట్లపై ఉన్న నెంబర్లను సరిచూసుకుంటే ఒకదానికి బంపర్ డ్రా తగిలినట్టు తెలిసింది. దీంతో, వాళ్లు ఉబ్బితబ్బిబ్బైపోయారు. కలల్లో తేలిపోయారు. తమకంటూ ఓ ఇల్లు కూడా కొనుక్కుందామని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజే కాక్స్ తన ఫ్రెండ్‌తో కార్టలిడ్జ్‌కు ఫోన్ చేయించి తమ బంధానికి ముగింపు పడిందని చెప్పించింది. తన ఫ్లాట్‌లోంచి అతడు వెళ్లిపోవాలని కూడా చెప్పింది. అతడితో లాటరీ డబ్బు పంచుకునేది లేదంది. తన డబ్బుతో టిక్కెట్టు కొన్నందుకు ఆ ప్రైజ్ మనీలో తనకూ సగం వాటా రావాలని మైఖేల్ వాదించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా లీగల్ వివాదం మొదలైంది.

Swiggy: మహిళ స్విగ్గీ అకౌంట్‌ హ్యాకింగ్.. నిందితులు ఎలాంటి షాకిచ్చారంటే..


విషయం నేషనల్ లాటరీ ఆర్గనైజేషన్ వరకూ వెళ్లింది. అయితే, లాటరీ టిక్కెట్టు మహిళ పేరు మీదే ఉండటంతో నిబంధనల ప్రకారం ఆమెకే డబ్బు చెల్లించాలని స్పష్టం చేసింది. అక్కడి రూల్స్ ప్రకారం, లాటరీ టిక్కెట్టును ఒకరి పేరుమీదే జారీ చేస్తారు. టిక్కెట్ ఎవరి పేరు మీద ఉంటే వారికే డబ్బు చెల్లిస్తారు. దీంతో, మైఖేల్ చేయగలిగింది ఏమీ లేకపోయింది. మైఖేల్ తన గర్ల్‌ఫ్రెండ్‌కు డబ్బు ఇచ్చినా ఇందుకు సంబంధించి వారి మధ్య లిఖితపూర్వకంగా ఎటువంటి ఒప్పందం జరక్కపోవడంతో అతడికి లాటరీ డబ్బులో వాటా దక్కలేదు.

అయితే, లాటరీ షాపులో సీసీటీవీ కెమెరాలు, ఇతర ట్రాన్సాక్షన్లు పరిశీలించగా అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌కు డబ్బు బదలాయించినట్టు కనిపించింది. ఇందుకు సమాధానంగా కాక్స్ మాత్రం తనదైన వివరణ ఇచ్చింది. అతడిని అప్పుడు డబ్బు అడిగిన మాట వాస్తవమేకానీ ఆ తరువాత తాను వేరుగా లాటరీ కొన్నట్టు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఆమె మాటే నెగ్గడంతో చివరకు మైఖేల్ రిక్తహస్తాలతో వెనుదిరగాల్సి వచ్చింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 22 , 2024 | 08:12 PM