Share News

Viral Video: సిగ్గులేని మానవ జాతికి గుణపాఠం చెప్పిన పులి.. వీడియో తప్పక చూడండి..!

ABN , Publish Date - Mar 20 , 2024 | 02:14 PM

Tiger Removes Plastic Bottle: ప్రపంచం మొత్తం కాలుష్య కాసారంగా(Polution) మారిపోతుంది. జల, వాయు, ధ్వని, భూమి కాలుష్యంతో జీవకోటి మనుగడే ప్రమాదంలో పడింది. ముఖ్యంగా మానవజాతి(Human) చేసే కాలుష్యం.. జంతుజాలాలకు ముప్పు పరిణమించింది. ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వినియోగం(Plastic) విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి పనికి ప్లాస్టిక్ వస్తువులనే వాడేస్తున్నారు. ఒకసారి వాడి పడేయడంతో..

Viral Video: సిగ్గులేని మానవ జాతికి గుణపాఠం చెప్పిన పులి.. వీడియో తప్పక చూడండి..!
Tiger Removes Plastic Bottle

Tiger Removes Plastic Bottle: ప్రపంచం మొత్తం కాలుష్య కాసారంగా(Polution) మారిపోతుంది. జల, వాయు, ధ్వని, భూమి కాలుష్యంతో జీవకోటి మనుగడే ప్రమాదంలో పడింది. ముఖ్యంగా మానవజాతి(Human) చేసే కాలుష్యం.. జంతుజాలాలకు ముప్పు పరిణమించింది. ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వినియోగం(Plastic) విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి పనికి ప్లాస్టిక్ వస్తువులనే వాడేస్తున్నారు. ఒకసారి వాడి పడేయడంతో.. భూమిపై ప్లా్స్టిక్ వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఇది కరిగిపోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం.. పేరుకుపోతున్న వ్యర్థాలతో యావత్ ప్రపంచం కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది.

అయితే, ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగం, నిర్లక్ష్య వైఖరిపై కనువిప్పు కలిగించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తతే జంతువులకు ఉన్న జ్ఞానం మనుషులమైన మనకు ఎందుకు లేదు? అని అనిపిస్తుంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ పులి నీరు తాగేందుకు నీటి కుంట వద్దకు వచ్చింది. నీటిలో ప్లాస్టిక్ బాటిల్ కనిపించగా.. దానిని తన నోటిని పట్టుకుంది. ఆ బాటిల్‌ను నీటి బయటకు తీసుకువచ్చి దూరంగా పడేసింది పులి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘జంతువులే చేసినప్పుడు.. మనం ఎందుకు చేయలేం?’ అంటూ క్యాప్షన్ పెట్టారు యూజర్. దీనిపై నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2024 | 02:14 PM