Share News

Viral Video: ఇంటి ముందు కార్ పార్క్ చేసిన జంటపై దాడి.. ముగ్గురు అరెస్టు

ABN , Publish Date - Mar 19 , 2024 | 11:45 AM

దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో వాహనాల పార్కింగ్ సమస్య ఉందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఎవరిదైనా ఇంటి ముందు కారు లేదా ఇతర వాహనం పార్క్ చేస్తే ఇంటి యజమానులు తీయాలని సున్నితంగా చెబుతారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. ఖాళీ స్థలంలో కారు పార్క్ చేసిన జంటపై దారుణంగా దాడి చేశారు. అందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: ఇంటి ముందు కార్ పార్క్ చేసిన జంటపై దాడి.. ముగ్గురు అరెస్టు

దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో వాహనాల పార్కింగ్(parking) సమస్య ఉందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఎవరిదైనా ఇంటి ముందు కారు లేదా ఇతర వాహనం పార్క్ చేస్తే ఇంటి యజమానులు తీయాలని సున్నితంగా చెబుతారు. మరికొంత మంది మాత్రం సర్లే అని ఊరు కుంటారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. ఓ ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో కార్ పార్క్(car park) చేసినందుకు గాను ఆ కుటుంబంలోని వ్యక్తులు పార్క్ చేసిన ఓ జంటపై దారుణంగా దాడి(attack) చేశారు. ఈ ఘటన బెంగళూరు(Bengaluru)లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకోగా అందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


వీడియోలో మొదట పార్క్ చేసిన వ్యక్తిని కొట్టి, ఆపై నేలపై నెట్టేసి తన్నడం కనిపిస్తుంది. ఆ తర్వాత మరికొంత మంది వ్యక్తులు కూడా అతనిపై దాడి చేశారు. ఆ వ్యక్తితో పాటు ఒక మహిళ కూడా ఉంది. ఆమె ఈ మొత్తం ఘటనను రికార్డ్ చేసింది. దీంతోపాటు ఇరుగు పొరుగువారు కూడా ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియా(social media)లో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్(video viral) కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు(police) ముగ్గురిపై కేసు నమోదు చేశారు. నిందితులందరినీ అరెస్టు చేశారు. సెక్షన్‌ 354, 324, 506 కింద ఎఫ్‌ఐఆర్‌(FIR) ఫైల్ చేశారు. బాధితులను రోహిణి, సహిష్ణుగా గుర్తించారు. వారు ఒక రోజు క్రితం ఆ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించడానికి వచ్చినట్లు సమాచారం.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Delhi: నాలుగోసారి చెత్త రికార్డును దక్కించుకున్న ఢిల్లీ

Updated Date - Mar 19 , 2024 | 11:45 AM