Share News

Delhi: నాలుగోసారి చెత్త రికార్డును దక్కించుకున్న ఢిల్లీ

ABN , Publish Date - Mar 19 , 2024 | 11:00 AM

దేశరాజధాని ఢిల్లీ నగరం మరోసారి చెత్త రికార్డును దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా వరుసగా నాలుగోసారి ఢిల్లీ పేరు నమోదైంది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు, దేశ రాజధానుల జాబితాను ఇటివల విడుదల చేసిన క్రమంలో వెల్లడించింది.

Delhi: నాలుగోసారి చెత్త రికార్డును దక్కించుకున్న ఢిల్లీ

దేశరాజధాని ఢిల్లీ(Delhi) నగరం మరోసారి చెత్త రికార్డును దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా(most polluted capital) వరుసగా నాలుగోసారి ఢిల్లీ పేరు నమోదైంది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్(Swiss organisation IQAir) ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు, దేశ రాజధానుల జాబితాను ఇటివల విడుదల చేసిన క్రమంలో వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం భారతదేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఎంపికైంది. ఈ క్రమంలో ఢిల్లీ గాలి నాణ్యత అత్యంత అధ్వాన్నంగా ఉన్న రాజధాని అని అభివర్ణించింది. 2018 నుంచి వరుసగా నాలుగోసారి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ ఈ ర్యాంక్‌ను పొందింది. అదే సమయంలో బీహార్‌లోని బెగుసరాయ్(Begusarai) ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఎంపికైంది.


కాలుష్య దేశాలు, నగరాల జాబితా ప్రకారం సగటు వార్షిక PM 2.5 గాఢతతో క్యూబిక్ మీటరుకు 54.4 మైక్రోగ్రాములుగా పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం మొదటి రెండు స్థానాల్లో బంగ్లాదేశ్‌(bangladesh)లో గాలి నాణ్యత క్యూబిక్ మీటరుకు 79.9 మైక్రోగ్రాములు, పాకిస్తాన్‌(pakistan)లో ఇది క్యూబిక్ మీటరుకు 73.7 మైక్రోగ్రాములతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 2022లో క్యూబిక్ మీటర్‌కు సగటున 53.3 మైక్రోగ్రాముల PM 2.5 గాఢతతో భారతదేశం 8వ అత్యంత కాలుష్య దేశంగా ర్యాంక్ దక్కించుకోగా, 2023లో మూడో స్థానానికి చేరింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో 1.36 బిలియన్ల మంది ప్రజలు PM 2.5కి గురయ్యారు. 2022 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 131 దేశాలు, 7,323 ప్రాంతాల నుంచి డేటాను సేకరించారు. 2023లో 134 దేశాలు, 7,812 ప్రాంతాల నుంచి డేటాను సమకూర్చారు.

ఇక కాలుష్యం కారణంగా ప్రతి ఏటా అనేక మంది ప్రజలు(people) తీవ్ర రోగాల బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా(worldwide) ప్రతి 9 మరణాలలో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. WHO నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 7 మిలియన్ల అకాల మరణాలకు వాయు కాలుష్యం కారణమని అంచనా వేసింది. పీఎం 2.5కు గురికావడం వల్ల ప్రజలు అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారని వెల్లడించింది. కాలుష్యం ద్వారా ఆస్తమా, క్యాన్సర్, స్ట్రోక్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Stock Markets: 623 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. సూచీల నష్టాలకు కారణమిదేనా?

Updated Date - Mar 19 , 2024 | 11:00 AM